Share News

Prakash Raj Apologizes: తప్పు చేశా.. క్షమించండి

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:34 AM

బెట్టింగ్‌ యాప్‌లకు ప్రమోట్‌ చేసి తప్పు చేశానని, తనని క్షమించాలని, మరోసారి అలాంటి పొరపాటు చెయ్యనని ప్రముఖ సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ అన్నారు...

Prakash Raj Apologizes: తప్పు చేశా.. క్షమించండి

  • బె ట్టింగ్‌ యాప్‌లకు ప్రచారంపై సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : బెట్టింగ్‌ యాప్‌లకు ప్రమోట్‌ చేసి తప్పు చేశానని, తనని క్షమించాలని, మరోసారి అలాంటి పొరపాటు చెయ్యనని ప్రముఖ సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన కేసులో సిట్‌ విచారణకు ప్రకా్‌షరాజ్‌ బుధవారం హాజరయ్యారు. దాదాపు గంట సేపు ప్రకా్‌షరాజ్‌ను ప్రశ్నించిన సిట్‌ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. సిట్‌ విచారణ అనంతరం ప్రకా్‌షరాజ్‌ విలేకరులతో మాట్లాడారు. బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసి తప్పు చేశానని, ప్రజలు క్షమించాలని, మరోసారి ఇలాంటి పొరపాటు చేయనని అన్నారు. ఓ యాప్‌ ప్రమోషన్‌కు సంబంధించి 2016లో ఒప్పందం చేసుకొని ప్రచారం చేశానని, ఆ యాప్‌ తర్వాత బెట్టింగ్‌ యాప్‌గా మారిందని తెలిపారు. ఆ విషయం తెలిసి వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని వివరించారు. ఆ ఒప్పందానికి సంబంధించి సిట్‌ అధికారులు అడిగిన వివరాలను అందజేశానని చెప్పారు. బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌ల్లో ఎంతోమంది యువత పెద్ద ఎత్తున డబ్బు పెట్టి నష్టపోతున్నారని, ఫలితంగా వారి కుటుంబాలు కష్టాలు పడుతున్నాయని ప్రకా్‌షరాజ్‌ పేర్కొన్నారు. కష్టపడకుండా ఉచితంగా వచ్చే డబ్బు ఆశించవద్దని, బెట్టింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. కాగా, బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి సినీ ప్రముఖులు దగ్గుబాటి రానా, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్‌ రాజ్‌ తదితరులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Updated Date - Nov 13 , 2025 | 04:34 AM