‘ప్రజావాణి’ అర్జీలను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:50 AM
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించా రు.
కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి ప్రజలనుంచి ఆయ న 24 అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతీవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి భూ సంబంధిత రెవె న్యూ సమస్యల దరఖాస్తులు అధికంగా వస్తుండటంతో వేగవంతమైన పరిష్కారంకోసం కలెక్టర్ హనుమంతరావు సరికొత్త విధానానికి తెర లేపారు. ప్రజావాణికి జిల్లాలోని 17 మండలాల తహసీల్దార్ల హాజరుకు మౌఖిక ఆదేశాలు ఉండటంతో సోమవారం జరిగిన ప్రజావాణికి అన్ని మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. వచ్చిన రెవెన్యూ సమస్యల దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్లకు వెనువెంట నే అందజేసి పరిష్కారం కోసం చర్య తీసుకునేలా ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులా ల్లో 2026-27 అడ్మిషన్లకోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) పోస్టరును అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థ లు) భాస్కర్‌రావు, గురుకులాల జిల్లా సమన్వయాధికారి పోతంశెట్టి సుధాకర్‌లతో కలిసి కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, జిల్లా రెవెన్యూ అదికారి జయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ విజయ్ సింగ్ పాల్గొన్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు
జిల్లాలో యూరియా కొరత లేదని అవసరమైన సరిప డా నిల్వలున్నాయని కలెక్టర్ హనుమంతరావు స్పష్టంచేశా రు. ప్రజావాణి అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు సరిపడా యూరియా ఎరువులు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 15,611 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, ఇంకా 6,191 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.