Share News

kumaram bheem asifabad- ఆసుపత్రి ఆవరణలో గుంతలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 10:38 PM

కాగజ్‌నగర్‌ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, రోగులను మరో కష్టం పీడిస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అంతా గుం తలు, బురదమయంగా మారింది. దీంతో రోగులు, ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కోట్లాది రుపాయలు వెచ్చించి ఆసుపత్రి నిర్మించినప్పటికీ ఆసుపత్రి ఎదుట ఉండే రోడ్లు, ప్లాట్‌ ఫాం నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు.

kumaram bheem asifabad- ఆసుపత్రి ఆవరణలో గుంతలు
గుంతలమయంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, రోగులను మరో కష్టం పీడిస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అంతా గుం తలు, బురదమయంగా మారింది. దీంతో రోగులు, ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కోట్లాది రుపాయలు వెచ్చించి ఆసుపత్రి నిర్మించినప్పటికీ ఆసుపత్రి ఎదుట ఉండే రోడ్లు, ప్లాట్‌ ఫాం నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ఎల్లాగౌడ్‌ తోటలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం ముందు భాగం పూర్తిగా బురదతో గుంతలమయంగా మారింది. సీజనల్‌ వ్యాధు లు ప్రబలుతుండడంతో నిత్యం ఎక్కువ మంది రోగులు, వారి బంధువులు, ఇతర వాహనాలు రాకపో కలు సాగిస్తున్నాయి. ఆవరణ మొత్తంగా గుంతలమ యంగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

- పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌..

కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేసి ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి కోట్లాది రూపాయలు వెచ్చించి నూతనంగా భవనం నిర్మించారు. అయిన ప్పటికీ ఆసుపత్రి ఆవరణలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆసుపత్రి ఆవరణలోనే పాత భవనంతో పాటు, మరో భవనంలో స్టోర్‌ రూం, ఒక గదిలో పోస్టుమార్టం గదికి కేటాయించారు. మరో పక్కన ఉన్న ఇంకో భవనంలో సీమాంక్‌ సెంటర్‌, డయాలసిస్‌ కేంద్రం ఉంది. సీమాంక్‌ సెంటర్‌, డయాలసిస్‌ కేంద్రానికి వచ్చే రోగులకు తిప్పలు తప్పడం లేదు. రాత్రి వేళల్లో కనీసం లైట్లు కూడా లేకపోవడంతో చీక ట్లోనే గుంతలమయగా ఉన్న రోడ్డు గుండా వెళ్లడం ప్రమాదకరంగా మారిందని చెబుతు న్నారు. పోస్టుమార్టం కేంద్రానికి మృతదేహాన్ని తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించడం, ఇందుకోసం వచ్చి వెళ్లే వారు రాత్రనక, పగలనక ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండగా, ఇక్కడకు వ చ్చే రోగు లకు ఆసుపత్రి ప్రాంగణం చిత్తడిగా, గుంతలమయంగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతోపాటు రాత్రి వేళ అంధకారం అలుముకుంటుండడంతో నరక యాతన పడాల్సి వస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చిం చి నిర్మించే భవనాలకు కనీసం సరైన రోడ్డు సౌకర్యం నిర్మించకుండా నిర్లక్ష్యంగావదిలివేయడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు రోడ్డు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 25 , 2025 | 10:38 PM