Share News

ప్రజలకు అందుబాటులో పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:27 PM

జిల్లాలోని క్షయ వ్యాధి గ్రస్థులకు, ప్రజలకు కేంద్ర క్షయ నియంత్రణ, రాష్ట్ర వైద్య శాఖ క్షయ నియంత్రణ విభాగం సంయుక్తంగా పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌ను అందుబా టులోకి తీసుకువచ్చారని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

ప్రజలకు అందుబాటులో పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని క్షయ వ్యాధి గ్రస్థులకు, ప్రజలకు కేంద్ర క్షయ నియంత్రణ, రాష్ట్ర వైద్య శాఖ క్షయ నియంత్రణ విభాగం సంయుక్తంగా పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌ను అందుబా టులోకి తీసుకువచ్చారని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్‌ను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్ధం రూ. 23 లక్షలతో పోర్ట బుల్‌ ఎక్స్‌రే మిషన్‌ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ నెల 21 నుంచి జిల్లాలో సేవలు అందించబడతాయన్నారు. జల్లాలో మారుమూల గ్రామాల్లోని లక్షా76 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఈ పరికరాన్ని ఏఐకి అనుసంధానం చేశామన్నారు. పరీక్ష రిపోర్టు రోగికి, సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు అందుతుం దన్నారు. ఈ మిషన్‌తో పాటు ఒక సాంకేతిక నిపుణుడు, ఒక సూపర్‌ వైజ ర్‌ అందుబాటులో ఉంటారని తెఇపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అనిత, ప్రోగ్రాం అధికారి సుధాకర్‌ నాయక్‌, జిల్లామాస్‌ మీడియా అదికారి బుక్కా వెంకటేశ్వర్లు, సమన్వయకర్త సురేందర్‌, డీపీవో ప్రశాంతి పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:27 PM