Share News

kumaram bheem asifabad-సర్కారు బడులకు ఆదరణ

ABN , Publish Date - Jul 08 , 2025 | 10:50 PM

సర్కారు బడుల్లో వి ద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. బడుల్లో మౌలిక వసతులు కల్పన, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయడంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూ ప దుస్తులు సకాలంలో ప్రభుత్వం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో సర్కారు బడుల్లో ప్రవే శాలు పెరుగుతున్నాయి.

kumaram bheem asifabad-సర్కారు బడులకు ఆదరణ
: గోయగాం ప్రీప్రైమరీ పాఠశాలలో చేరిన విద్యార్థులు

- గోయగాం ప్రీ ప్రైమరీ పాఠశాలలో 33 మంది ప్రవేశాలు

కెరమెరి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సర్కారు బడుల్లో వి ద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. బడుల్లో మౌలిక వసతులు కల్పన, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయడంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూ ప దుస్తులు సకాలంలో ప్రభుత్వం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో సర్కారు బడుల్లో ప్రవే శాలు పెరుగుతున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ పాఠశా లల్లో చేర్పించాలని నిర్వహించిన బడిబాట కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల వైఖరిలో మార్పును తెచ్చినట్లు కనిపిస్తోంది. బడిబాట కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు భాగస్వాములు కావడంతో మంచి స్పందన లభించింది. ఈ మేరకు మండలంలోని గోయగాం ప్రాథమిక పాఠశాలలో విద్యా సంఖ్య పెరిగింది. గతేడాది వరకు 33 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులు చేసిన కృషి ఫలించింది. నెల రోజుల్లోనే మరో 33 మంది చిన్నారులు పాఠశాలలో ప్రవేశం పొం దారు. దీంతో ప్రస్తుతం పాఠశాలలో 75 మంది విద్యార్థు లు విద్యనభ్యసిస్తున్నారు. మండలంలోని 85 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 342 మంది ఈ ఏడాది అడ్మిషన్‌ తీసుకున్నారు. వారిలో 76 మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు.

- ప్రీప్రైమరీ ప్రారంభంతో..

గోయగాంలో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రీప్రైమరీ పాఠశాల ప్రారం భించారు. దీంతో ప్రైవేటు పాఠశాల నుంచి సర్కారు బడిలో 33 మంది విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకున్నారు. ఇఇతర తరగతుల్లోనూ సంఖ్య పెరగడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులతో పాటు కొంత మంది యువకులు ప్రభుత్వ పాఠశాలలపై అవ గాహన కల్పించారు. పాఠశాల అభివృద్ధిఖి దాతలు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎంఈవో ప్రకాష్‌ ఐదు వేలు, సావర్‌ఖేడ హెచ్‌ఎం ఐదు వేలు, గోయగాం హెచ్‌ఎం రవిజేత 24 వేల రూపాయలు అందజేశారు. గ్రామస్థుడు సుధాకర్‌ చిన్నారులకు బ్యాగులు, విజయ్‌ గుర్తింపు కార్డులు అందించగా, సునీల్‌ అనే వ్యక్తి ప్రతి నెలా 50 కిలోల బియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. బడిబాటలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవితేజతో పాటు ఉపాధ్యాయులు, యువకులు గ్రామం లో విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి తిరిగి విద్యార్థుల వివరాలు సేకరించారు. తన సొంత ఖర్చులతో కరపత్రాలు ముద్రించి ప్రచారం నిర్వహించారు. ఆగస్టు నెలాఖరు వరకు ప్రవేశాలకు సమయం ఇవ్వడంతో మరింత మంది పెరిగే అవకాశం ఉంది.

విద్యార్థుల సంఖ్య పెరుగాలి..

- ఆడె ప్రకాష్‌, ఎంఈవో

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగాలి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందించేందుకు కార్యాచరణ రూపొందించాం. ప్రైవేటు పాఠశాలల నుంచి అత్యధిక మంది విద్యార్థులను చేర్చు కోవాలని ఆదేశాలిచ్చాం. ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు ఉంటే ప్రీప్రైమరీ ప్రారంభిస్తాం.

ప్రీప్రైమరీ ప్రారంభించాలనుకున్నాం..

- రవితేజ, ప్రాధానోపాధ్యాయుడు

గత ఏడాది నుంచే ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులతో ప్రీప్రైమరీ పాఠశాల ప్రారంభించాల నుకున్నాం. బడిబా టలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేస్తున్నాం. గ్రామస్థు లు, యువకులు ఎంతో చేయూతనిస్తున్నారు. ఉపాధ్యా యుల సహకారంతో మెరుగైన విద్య అందిస్తాం.

Updated Date - Jul 08 , 2025 | 10:50 PM