Ponguleti Srinivas Reddy: ఎన్డీయే హామీలు బూటకం
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:05 AM
రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బిహార్‌లో అభివృద్ది కుంటుపడిందని బిహార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక...
ఒక్కసారి మహాగఠ్‌బంధన్‌కు అవకాశం ఇవ్వండి.. తెలంగాణ మోడల్ పాలన అందిస్తాం
బిహార్ ఓటర్లకు మంత్రి పొంగులేటి పిలుపు.. ప్రియాంకతో కలిసి ఎన్నికల ప్రచారం
పాట్నా, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బిహార్‌లో అభివృద్ది కుంటుపడిందని బిహార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. ఎన్డీయే కోటి వరాల హామీలు బూటకమని, ఒక్కసారి మహాగఠ్‌బంధన్‌కు అవకాశం ఇవ్వాలని బిహార్ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా చనుపటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి ప్రసంగిస్తూ ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అలవికాని హామీలను ఇస్తుందన్నారు. 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండి యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఎంతమంది దీదీలను లక్షాధికారులుగా చేశారో చెప్పాలన్నారు. మహాగఠ్‌బంధన్‌ను గెలిపిేస్త తెలంగాణ మోడల్ పాలనను బిహార్‌లో అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పొంగులేటి వివరించారు. రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయిలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలను అమలు చేస్తున్నామన్నారు. బిహార్ ప్రజలు ఈసారి విజ్ఞతతో ఆలోచించి మహాగఠ్‌బంధన్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మహాగఠ్‌బంధన్‌ను గెలిపిేస్త యువకుడైన తేజస్వియాదవ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ప్రకటించలేని దుస్థితిలో ఉందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ బహిరంగ సభలో బిహార్ రాష్ట్ర ఇంచార్జ్ కృష్ణ అల్వర్, ఎంజీబీ అభ్యర్థి అభిషేక్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.