Ponguleti Srinivas Reddy: భూకేటాయింపుల లెక్కలు తేల్చండి: పొంగులేటి
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:27 AM
గత నాలుగు దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ నుంచి వివిధ అవసరాల కోసం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు సేకరించాలని....
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గత నాలుగు దశాబ్దాలుగా రెవెన్యూ శాఖ నుంచి వివిధ అవసరాల కోసం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు సేకరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కేటాయించిన భూములు, వాటి వినియోగం, ప్రస్తుత పరిస్థితి మీద సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ, అటవీ శాఖలతోపాటు పలు విభాగల అవసరాల కోసం రెవెన్యూ శాఖ నుంచి భూములు కేటాయించారని, అయితే రాష్ట్ర విభజన తర్వాత కొన్ని కేటాయింపులు రద్దయ్యాయని చెప్పారు. గత 30-40 ఏళ్లలో అటవీ శాఖకు కేటాయించిన భూమి ఎంత అనేది తేల్చేందుకు అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.