Share News

KTR: పొంగులేటి.. లక్కీ లాటరీలో మంత్రి!

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:09 AM

తంతే.. గారెలబుట్టలో పడినట్టు లక్కీలాటరీలో మంత్రి అయిన పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మళ్లీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దామని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల తో భేటీ అయిన ఆయన..

KTR: పొంగులేటి.. లక్కీ లాటరీలో మంత్రి!

  • పాలేరులో ఆయనెలా గెలుస్తారో చూద్దాం?

  • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీఆర్‌ఎ్‌సదే గెలుపు: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తంతే.. గారెలబుట్టలో పడినట్టు లక్కీలాటరీలో మంత్రి అయిన పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మళ్లీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దామని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల తో భేటీ అయిన ఆయన.. ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడుల్లో దొరికిన డబ్బు గురించి కేంద్రంగానీ, ఆయనగానీ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించా రు. ‘‘పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యారా? బీజేపీతో కుమ్మక్కైన రేవంత్‌రెడ్డితో పొంగులేటి కలిసిపోయారా?’’అని నిలదీశారు. బతికినంత కాలం ధైర్యంగా బతకాలని.. ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు పనికిరావని అన్నారు. ఎవరెన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని..కాంగ్రె్‌సకు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. హైదరాబాద్‌ను తెలంగాణ ఆర్థిక ఇంజన్‌గా మార్చిన బీఆర్‌ఎస్‌ పాలనకు భిన్నంగా.. కాంగ్రెస్‌ సర్కార్‌ విధానాలు రాజధాని నగర ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని.. ప్రజలు ఇది గమనిస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌.. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి సృష్టించిన భయం కారణం గా హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నా రు. అలాగే.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై నిర్వహించిన బీఆర్‌ఎ్‌సపార్టీ సన్నాహక సమావేశానికి కేటీఆర్‌ అధ్యక్షత వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి, బీఆర్‌ఎస్‌ విజయయాత్రను జూబ్లీహిల్స్‌ నుంచి తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు బీఆర్‌ ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.

ఇంత అసమర్థ పాలన ఎక్కడైనా ఉందా?

‘‘సర్కార్‌ ఘోర తప్పిదంవల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి ఆరుగురు మరణిస్తే.. వారి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశావ్‌. చివరికి హైదరాబాద్‌లో నాలా లో కొట్టుకుపోయిన ముగ్గురి పార్థివదేహాలను మూడురోజులైనా గుర్తించలేవా?’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇంత చేతకానితనం, అసమర్థపాలన ఎక్కడైనా ఉందా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే బీజేపీకి గౌరవంలేదని.. అందుకే వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతించిన బీఆర్‌ఎ్‌సను ఆ పార్టీ నేత లు విమర్శిస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. బీజేపీది నకిలీజాతీయవాదమని, తమది మా త్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని మంగళవారం ఎక్స్‌వేదికగా వ్లెలడించారు. కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీల ఓట్లను సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీకి అమ్ముకున్నారని.. ఈ విషయాన్ని కాంగ్రె్‌సకు చెందిన ముగ్గురు ఎంపీలు తనకు చెప్పారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. ఓట్‌ చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణ సీఎం ఓట్‌ చోరీ గురించి ముందు తెలుసుకోవాలన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 05:10 AM