Minister Ponnam: కాలుష్య రహితం.. మన లక్ష్యం
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:34 AM
పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, పట్టణ నివాస యోగ్యతను తమ ప్రభుత్వం కీలకంగా చూస్తుందని మంత్రి.....
పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, పట్టణ నివాస యోగ్యతను తమ ప్రభుత్వం కీలకంగా చూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘‘కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగం’’పై మంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వం కాలుష్య రహిత రవాణా(క్లీన్ మొబిలిటీ)ని కేవలం పర్యావరణ లక్ష్యంగా కాకుండా ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, పట్టణ నివాస యోగ్యతకు కీలకంగా చూస్తుందని చెప్పారు. 2047 నాటికి ‘0’ ఉద్గార రవాణా(జీరో-ఎమిషన్ మొబిలిటీ)లో తెలంగాణ దిక్సూచిగా ఎదగాలని చెప్పారు. విద్యుత్ వాహనాలకు(ఈవీలు) భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. 2026 డిసెంబరు 31 వరకు అన్ని ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుములో 100 శాతం మినహాయింపు ఇచ్చామని మంత్రి వివరించారు. . ప్రభుత్వం 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను(ఏటీఎస్) ఏర్పాటు చేస్తుందన్నారు. అధునాతన డ్రైవింగ్ శిక్షణ సంస్థలు, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు, ఉద్గార రహిత రవాణా(జీరో-ఎమిషన్ మొబిలిటీ), ప్రమాద రహిత(జీరో-ఫ్యాటాలిటీ) రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.