Share News

kumaram bheem asifabad- రాజకీయ వేడి

ABN , Publish Date - Oct 04 , 2025 | 10:57 PM

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అడుగులు వేస్తుండగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. జిల్లాలోని రెండు నియోజకవ ర్గాల పరిధిలో మెజార్టీ స్థానాలు గెలుపొందేందుకు ఆయా పార్టీల ప్రధాన నాయకకులు వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌, సిర్పూరులో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు

kumaram bheem asifabad- రాజకీయ వేడి
లోగో

- జిల్లాలో పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపునకు వ్యూహాలు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అడుగులు వేస్తుండగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. జిల్లాలోని రెండు నియోజకవ ర్గాల పరిధిలో మెజార్టీ స్థానాలు గెలుపొందేందుకు ఆయా పార్టీల ప్రధాన నాయకకులు వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌, సిర్పూరులో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చింది. ఏడాదిన్నర తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండడంతో తాజాగా పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్వవైభవం కోసం అడుగులు వేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మెజార్టీ తెచ్చేందుకు కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తోం ది. స్థానిక ఎన్నికల్లో బీజేపీ కూడా తమ బలాన్ని చూపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

- ప్రధాన పార్టీలకు..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు స్థానిక సంస్థల ఎన్నికలు అగ్నిపరీక్షలాగా మారా యి. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తుండడంతో సిర్పూరు రాజకీయం ఒక్కసారిగా మారింది. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇటీవల హైదరాబాద్‌లో మాజీమంత్రి కేటీఆర్‌, హరీష్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటి వ రకు సిర్పూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పా ర్టీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చూస్తున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉండి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా ఉంటుందా అన్న విషయంపై చర్చ కొనసాగుతోంది. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇపాటికే సిర్పూరు నియోజకవర్గంలో ఏడు మండలాల్లో కూడా తమకు అనుకూలంగా ఉన్న వారిని, గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు కూడా పక్కాగా ప్రణాళిక వేసి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీలో పక్కాగా గెలిచే వారిపై సర్వేలు కూడా చేస్తున్నారు. సిర్పూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మె ల్యే హరీష్‌బాబు స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థులు గెలిపించుకు నేందుకు పావులు కదుపుతున్నారు. ఆసిఫాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్‌ ఎస్‌ పార్టీకి చెందిన వారే కావడంతో స్థానిక సంస్థల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు ఆధ్వర్యంలో గుర్తించే అవకా శాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏడాదిన్నర కా లంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు దండుకోవాలనే వ్యూహంతో వెళ్లనున్నది. బీఆ ర్‌ఎస్‌, బీజేపీలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యా లను ఎండగడుతూ లబ్ధి పొందాలని వ్యూహ రచన చేస్తున్నాయి.

Updated Date - Oct 04 , 2025 | 10:57 PM