Adluri Lakshman: హరీశ్.. గురుకులాలపై రాజకీయాలొద్దు
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:12 AM
గురుకులాలపై హరీశ్‌రావు రాజకీయాలు చేయడం బాధాకరమని.. పేద దళిత, బీసీ పిల్లలతో రాజకీయాలు చేయొద్దని మంత్రి అడ్లూరి..
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గురుకులాలపై హరీశ్‌రావు రాజకీయాలు చేయడం బాధాకరమని.. పేద దళిత, బీసీ పిల్లలతో రాజకీయాలు చేయొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హితవు పలికారు. కుటుంబ తగాదాలతో ఆయన నోటికొచ్చింది మాట్లాడుతున్నారని.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా హాస్టల్ పిల్లలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఏ సంక్షేమ హాస్టల్‌కైనా వెళ్లి పరిశీలించడానికి సిద్ధమేనంటూ హరీశ్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. సోమవారం గాంధీభవన్‌లో అడ్లూరి మీడియాతో మాట్లాడారు. తమ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ పనుల పేరుతో వేల కోట్లు దండుకున్న కేసీఆర్.. ఏనాడూ గురుకులాల గురించి ఆలోచించలేదన్నారు. ప్రతిరోజు ఒక అధికారి వసతి గృహాలను తనిఖీ చేయడానికి కార్యాచరణ రూపొందించామని, పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎ్‌సను ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు చెప్పారు.