విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:19 PM
విధి ని ర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రా మగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గురువారం తాండూర్ పోలీస్‌స్టేషన్ ను సందర్శించారు.
రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
తాండూర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : విధి ని ర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రా మగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గురువారం తాండూర్ పోలీస్‌స్టేషన్ ను సందర్శించారు. పోలీసు అమరవీరుల సంస్మర ణ వారోత్సవాల్లో భాగంగా యువకులకు వాలీబాల్ కిట్‌లను అందజేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ లో ని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణమే స్పం దించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సీ సీ కెమెరాల ఏర్పాటు, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వాహనాల తనిఖీలు చేపట్టాలని, శాంతి భద్రతల ప రిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు పనిచేస్తున్నారని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడల ద్వారా శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంత రం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశా రు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, ఏసీపీ రవి కుమార్, సీఐ దేవయ్య, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, సౌ జన్య, సిబ్బంది పాల్గొన్నారు.