MLC Konda Murali: ప్రొటోకాల్‌లేకున్నా కొండా మురళికి పోలీస్ సెల్యూట్
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:42 AM
పరపతి ఉన్న రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ లేకున్నా పోలీసులు సెల్యూట్ కొట్టే పద్ధతిని వీడలేకపోతున్నారు....
వరంగల్ క్రైం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పరపతి ఉన్న రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ లేకున్నా పోలీసులు ‘సెల్యూట్’ కొట్టే పద్ధతిని వీడలేకపోతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్‌రావుకు మిల్స్‌కాలనీ సీఐ బొల్లం రమేశ్, మరో మహిళా అధికారి సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి వచ్చిన మురళికి సీఐ బొల్లం రమేశ్ ప్రొటోకాల్ తరహాలో సెల్యూట్ చేయడం చర్చకు దారితీసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి.. ఇద్దరు అధికారులను మందలించినట్లు సమాచారం.