kumaram bheem asifabad-ఘనంగా పోచమ్మ బోనాలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:46 PM
రెబ్బెన, కౌటాల, ఆసిఫాబాద్ మండలాల్లో ఆదివారం భక్తులు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. రెబ్బెన మండలం వంకులం గ్రామ మహిళలు పెద్దవాగు గాంఽధరి మైసమ్మ ఆలయంలో ఆదివారం పోశమ్మ బోనాలు నిర్వహించారు.
రెబ్బెన, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెబ్బెన, కౌటాల, ఆసిఫాబాద్ మండలాల్లో ఆదివారం భక్తులు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. రెబ్బెన మండలం వంకులం గ్రామ మహిళలు పెద్దవాగు గాంఽధరి మైసమ్మ ఆలయంలో ఆదివారం పోశమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే కోవ లక్ష్మి బోనమెత్తి తల్లికి మొక్కులు తీర్చుకుంది. ఈ సందర్భంగా పూజకార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రెబ్బెన సింగిల్ విండో చైర్మన్ సంజీవ్, వైస్ చైర్మన్ రంగు మహేష్, తిరుపతి, ఒమాజీ, నాగయ్య, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు రవీందర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలం వీర్దండి గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను నెత్తి పెట్టుకుని ర్యాలీగా అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలు బాగా పండాలని, సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేణుక, తదితరులు పాల్గొన్నారు .
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని రాజంపేట కాలనీకి చెందిన ప్రజలు ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఏటా కాలనీ నుంచి అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటామని స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పాల్గొన్నారు.