India Trade Agreements: రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:59 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో...
జపాన్, చైనా పర్యటనలపై చర్చ
జీఎస్టీ సంస్కరణలపై కూడా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన తాను ఇటీవల జరిపిన జపాన్, చైనా పర్యటనల గురించి వివరించారు. జపాన్‌తో జరిగిన ఒప్పందాల గురించి తెలిపారు. అదే సమయంలో చైనాలోని తియాన్‌జెన్ నగరంలో జరిగిన ఎస్‌సీఓ సమావేశం వివరాలు కూడా పంచుకున్నారు. ఎస్‌సీఓ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో జరిగిన సమావేశాలపై ముర్ముకు వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై కూడా రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం.