kumaram bheem asifabad- పీఎం కిసాన్ అందక పరేషాన్
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:52 PM
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి సమ్మాన్ నిధి పథకం ప్రారంభించింది. ఏడాదికి రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేలు వారి ఖాతాల్లో జమ చేస్తోంది. 2019జనవరి 31వరకు కట్ ఆఫ్ డేట్ విధించింది. అప్ప టి నుంచి కొత్తగా భూమి కొనుగోలు చేసినా, వారస త్వంగా భూమి బదలాయింపు అయినా ఈ పథకం వర్తించదు.
- అమలు చేయక రైతుల అవస్థలు
- కొత్త రైతులకు పథకాన్ని అమలు చేయాలని వేడుకోలు
బెజ్జూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి సమ్మాన్ నిధి పథకం ప్రారంభించింది. ఏడాదికి రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేలు వారి ఖాతాల్లో జమ చేస్తోంది. 2019జనవరి 31వరకు కట్ ఆఫ్ డేట్ విధించింది. అప్ప టి నుంచి కొత్తగా భూమి కొనుగోలు చేసినా, వారస త్వంగా భూమి బదలాయింపు అయినా ఈ పథకం వర్తించదు. అప్పటి నుంచి జిల్లాలో 15 మండలాల్లో కొత్తగా పాసు పుస్తకాలు పొందినవారు, పట్టా మార్పిడి చేసుకున్న వారు మొత్తం 1,620మంది ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.42లక్షల మంది పట్టా పాసు పుస్తకాలు కలిగి ఉన్నారు. నిబంధనల కారణంగా చాలా మంది ఈ పథకాన్ని పొందలేకపోయారు. 2019జనవరి 31లోపు పట్టాలు ఉన్నవారు అర్హులుగా ప్రకటించినా సరైన అవగాహన లేక రైతులు దరఖాస్తులు చేసుకోలేదు. ఆ తర్వాత చేసుకున్నా మంజూ రు కాలేదు. దీంతో ఏటా ఈ పథకం ద్వారా సాయం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
- పాతవారికే సాయం..
కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఇటీవల సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసింది. మూడో విడత ఈ ఏడాది చివర్లో విడుదల చేయనుంది. ఏటా ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈసారైనా కొత్త వారికి సాయం అందేనా అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. జిల్లాలో పాత రైతులు 33,363మంది మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ పథకంపై కఠిన నిబంధనలు పెడుతోంది. ఒక్క సమాచారం ఇవ్వకున్నా సాయం నిలిపివేస్తారు. రూ.10వేలకు పైగా పింఛను వచ్చే వారు, ప్రభుత్వ ఉద్యోగులు కిసాన్ సమ్మాన్ నిధికి అనర్హులు. కుటుంబంలో దంపతులకు వేర్వేరు గ్రామాల్లో భూమి ఉన్నా ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది. ప్రజాప్రతినిధులు, విదేశాల్లో ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఈ సాయం వర్తించదు.
- విశిష్ట గుర్తింపు కార్డులపై ఆశలు..
పీఎం కిసాన్ సహా కేంద్ర పథకాలను వర్తిపజేసేందుకు రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు ఇచ్చే విధానాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. 11నంబర్లతో కూడిన విశిష్ట సంఖ్య కేటాయిస్తోంది. దీనికి రైతులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతు వేదికల్లో ఏఈవోల వద్ద వివరాలు నమోదు చేసుకుంటున్నారు. విశిష్ట సంఖ్య పొందితే సాయం అందుతుందని అంతా ఆశపడ్డా నిరాశే ఎదురైంది.
మార్గదర్శకాలు లేవు..
- నాగరాజు, వ్యవసాయ అధికారి, బెజ్జూరు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కొత్తవారికి సాయం అందించే విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. కేంద్రం 2019నుంచి కటాఫ్ తేదీ విధించింది. అప్పటి నుంచి కొత్తగా పాసు పుస్తకాలు అందిన వారికి పథకం అమలు కావ డం లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే రైతులకు సమాచారం అందిస్తాం.