ఆహ్లాదం అధ్వానం..!
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:34 PM
జిల్లా కేంద్రంలో ప్రజల కోసం రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన మినీ పార్కు రూప రేఖలు పూర్తిగా మారిపోయాయి. పార్కు ను సమూలంగా చిదిమేసిన ఓ చిరు వ్యాపారి ఆ స్థ లంలో కుటుంబంతో సహా తిష్ట వేసినప్పటికీ మున్సి పల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ఇంత కాలం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచిన అండర్ బ్రిడ్జి ఏరి యా పూర్తిగా కలావిహీనంగా దర్వనమిస్తోంది.
కళావిహీనంగా మారిన అండర్ బ్రిడ్జి పార్కు
పార్కును చిదిమేసి స్థలం కబ్జా చేసిన వ్యాపారి
పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం
మంచిర్యాల, జూలై7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రజల కోసం రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన మినీ పార్కు రూప రేఖలు పూర్తిగా మారిపోయాయి. పార్కు ను సమూలంగా చిదిమేసిన ఓ చిరు వ్యాపారి ఆ స్థ లంలో కుటుంబంతో సహా తిష్ట వేసినప్పటికీ మున్సి పల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ఇంత కాలం ప్రజలకు ఆహ్లాదాన్ని పంచిన అండర్ బ్రిడ్జి ఏరి యా పూర్తిగా కలావిహీనంగా దర్వనమిస్తోంది. మినీ పార్కులో ప్రస్తుతం గత స్మృతికి చిహ్నంగా కొన్ని పక్షు ల బొమ్మలు, ఇతర పరికరాల మాత్రమే మిగిలాయి. మినీ పార్కు ముందు నుంచి నిత్యం వందలాది మంది పట్టణ ప్రజలు రాకపోకలు సాగిస్తూ అఽధికారుల వైఖరి పట్ల చీవాట్లు పెడుతున్నారు.
రూ. 20లక్షలతో అభివృద్ది....
జిల్లా కేంద్రంలోని శ్రీనివాసటాకీస్ ఏరియా, కాలేజీ రోడ్డును కలుపుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. శ్రీనివాస్ టాకీస్ ఏరియా నుంచి కాలేజీ రోడ్డు వైపు వె ళ్లేందుకు బ్రిడ్జి కింద అండర్ పాస్ ఏర్పాటు చేసి ఇరు వైపుల సర్వీసు రోడ్లు నిర్మించారు. అండర్ పాస్ వద్ద రూ. 20లక్షలు జనరల్ ఫండ్ వెచ్చించి ఇరువైపుల అం దమైన మొక్కలు, వాల్ పెయింటింగ్స్‌తో పాటు వివిధ రకాల జంతువులు, పక్షి బొమ్మలను ఏర్పాటు చేసి ప్రజ లకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. 2018-19 సమయంలో అప్పటి కలెక్టర్ బారతీ హోలీకేరీ ఆదేశాల మేరకు మున్సిపల్ అప్పటి కమిషనర్ స్వరూ ప రాణి పార్కు అభివృద్ధి పనులు స్వయంగా పర్యవే క్షించారు. అండర్ బ్రిడ్జి ఏరియా మినీ పార్కుగా అభి వృద్ధి చెందడంతో చూపరులను అమితంగా ఆకట్టుకు నేది. గతంలో పార్కు ప్రదేశంలో కొంత మంది చేతి వృత్తుల వారు స్థిరపడి తమ కార్యకలాపాలు కొనసా గించే వారు. ఆ సమయంలో అండర్ పాస్ వద్ద స్నా నాలు, మలమూత్ర విసర్జనలు చేయడంతో స్థానికులు ఆందోళనబాటపట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన చేతి వృత్తుల వారు ఆస్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో కలె క్టర్ ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య కమి షనర్ స్వరూపరాణి వారిని అక్కడి నుంచి ఖాళీ చే యించి మినీ పార్కు ఏర్పాటుకు బాటలు వేశారు.
కానరాని ఓడీఎఫ్...
మంచిర్యాల మున్సిపాలిటిలో గతంలో వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలనకు అధి కారులు శాయశక్తుల కృషి చేశారు. ఇందు కోసం వీదుల వెంట టాయిలెట్లు, మూత్రశాలలు నిర్మించారు. దీంతో పట్టణాన్ని వందశాతం బహిరంగ మలమూ త్ర విసర్జన రహితంగా ప్రభుత్వం ప్రకటించింది. అయి తే దానికి భిన్నంగా ప్రస్తుతం అదే దారిలో పట్టణం పయనిస్తోంది. నగరపాలక సంస్థగా మారినప్పటికీ వం దశాతం ఓడీఎఫ్(బహిరంగ మల మూత్ర విసర్జన) నిర్మూలన అమలు కావడం లేదు. ముఖ్యంగా చేతి వృ త్తుల వారు అండర్ బ్రిడ్జి ఏరియాను హస్తగతం చేసు కోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పార్కును చదును చేసి అక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున ్న వారు మలమూత్ర విసర్జన కోసం స్థానికంగా ఉన్న రైల్వే పట్టాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైల్వే ట్రాక్‌కు సమీపంలో నివసిస్తున్న జనాలు నానా ఇబ్బందులు ప డుతున్నారు. ఈవిషయమై సంబంధిత అధి కారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోతు న్నారు. మినీ పార్కు స్థలంలో ఏకంగా ఐదారు కుటుం బాలు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
కూరగాయల విక్రేతలతో రాకపోకలకు ఇబ్బంది...
ఇదిలా ఉండగా ఓవర్ బ్రిడ్జి నుంచి మొదలు కొని కాలేజీ రోడ్డులో కూరగాయల విక్రయాలు జరుగుతు న్నాయి. వ్యాపారస్తులు రోడ్ల వెంట దుకాణాలు ఏర్పా టు చేసుకొని విక్రయాలు చేపడుతుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కాలేజీ రోడ్డలో పదుల సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వీటి కారణంగా ఈ ప్రాంతంలోని నిత్యం రద్దీగా ఉం టోంది. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేవారు సై తం ఇదే దారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. వీటికి అదనంగా ఇటీవల ప్రారంభించిన మహా ప్రస్థా నం వద్దకు వెల్లేందుకు కూడ ఇదే రోడ్డును ఉపయో గించాలి. తద్వారా కాలేజీ రోడ్డు నిత్యం బిజీగా ఉంటుం డగా వాహనాల రాకపోకల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మినీ పార్కు స్థలాన్ని అక్ర మంగా ఆక్రమించిన వ్యాపారస్తులను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ ప్రదేశంలో కూరగాయల విక్రేతల స్టాల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ దిశగా సంబం ధిత అధికారులు చర్యలు చేపట్టాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఈ ప్రాంతంలో స్థితరపడ్డ చిరువ్యాపారులను ఖాళీ చేయిం చిన అధికారులు వారికి నగరంలోని క్యారీ రోడ్డులో శా శ్వత స్థలాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులను కూడ క్వారీ రోడ్డుకే తరలించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.