kumaram bheem asifabad- ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:59 PM
ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక క్రీడా పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని అన్నారు. ఆసిఫాబాద్, జైనూరు, కాగజ్‌నగర్, మంచిర్యాలలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులకు ఎనిమిది అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక క్రీడా పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని అన్నారు. ఆసిఫాబాద్, జైనూరు, కాగజ్‌నగర్, మంచిర్యాలలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులకు ఎనిమిది అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో దాదాపు 800 మంది క్రీడాకారులు 100 ఎస్కార్ట్, పీడీ, పీఈటీలు పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. అంతకు ముందు విద్యార్థులచేత గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, ఏసీఎంవోలు ఉద్దవ్, లక్కయ్య, ఏటీడీవోలు శివకృష్ణ, శ్రీనివాస్, సురేష్, శ్రీనివాస్, క్రీడాధికారులు శేషు, జీవరత్నం, మీనారెడ్డి, జీసీడీవో శకుంతల, టీడబ్ల్యూటీయూ నాయకులు కృష్ణరావ్, గోపాల్, రవీందర్, శైలజ, అనంత్, పీడీలు మధు, వెంకటేష్, రవీందర్, సుభాష్, శ్రీనివాస్, విద్యాసాగర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు
అలరించిన కార్తీక దీపోత్సవం
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకలు అలరించాయి. మంచిర్యాల జిల్లా లక్షేటిపేటకు చెందిన ప్రణవ్‌శర్మ ఆధ్వర్యంలో 18 మంది వేద పండితులు ప్రత్యేక శివ లింగార్చన, గణపతి పూజ చేపట్టడంతో పాటు దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి-సోనేరావు దంపతులతో పాటు తనయుడు సాయినాథ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజ కవర్గ ప్రజల సంక్షేమం కోసం కార్తీక దిపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ దీపార్చన కార్యక్రమంలో పట్టణంలోని అయా కాలనీలకు చెందిన మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున హజరై కార్తీక దీపాలు వెలిగిం చారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన సంగీత విభావరి భక్తి పాటలను ఆలపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మర్సుకోల సరస్వతి, బుర్స పోచయ్య, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.