Share News

మొక్కలు సిద్ధం చేసుకోవాలి : ఏడీఆర్‌డీవో

ABN , Publish Date - May 29 , 2025 | 11:36 PM

హరితహారంలో పథకంలో నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసుకోవాలని అదనపు డీఆర్‌డీవో రాజేశ్వరి సూ చించారు.

మొక్కలు సిద్ధం చేసుకోవాలి : ఏడీఆర్‌డీవో
ఉపాధి హామీ పనుల వద్ద రికార్డులను పరిశీలిస్తున్న అదనపు డీఆర్‌డీవో రాజేశ్వరి

తిమ్మాజిపేట, మే 29 (ఆంధ్రజ్యోతి) : హరితహారంలో పథకంలో నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసుకోవాలని అదనపు డీఆర్‌డీవో రాజేశ్వరి సూ చించారు. మండల పరిధిలోని మ రికల్‌, మాన్యనాయక్‌తండా గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను పరిశీ లించి ఉపాధి హామీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న ప నులను పరిశీలించి కూలీలతో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ కూలీల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కూ లీలకు సక్రమంగా డబ్బులు వారి ఖాతాలో పడే లా చూడాలని, వారి పని దినాలలో సరిపోను కూలీ రావాలని ఆ విధంగా కూలీలతో పని చేయించాలన్నారు. అంతకు ముందు మరికల్‌ గ్రామపంచాయతీ ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై పలు విషయాలపై మాట్లాడారు. ఏపీవో సత్యనారాయణ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ బాలరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:36 PM