Share News

kumaram bheem asifabad- మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , Publish Date - Jul 11 , 2025 | 10:26 PM

మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలని డివిజనల్‌ మేనేజర్‌ శ్రావణి అన్నారు. కాగజ్‌నగర్‌ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు ప్రతి ఒక్కరూ నాటాలన్నారు.

kumaram bheem asifabad- మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కలు నాటుతున్న టీజీఎఫ్‌డీసీ డివిజనల్‌ మేనేజర్‌ శ్రావణి, సిబ్బంది

కాగజ్‌నగర్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలని డివిజనల్‌ మేనేజర్‌ శ్రావణి అన్నారు. కాగజ్‌నగర్‌ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు ప్రతి ఒక్కరూ నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్లాంటేషన్‌ మేనేజర్‌ గోగుల సురేష్‌ కుమార్‌, లక్ష్మణ్‌, జలపతి, వసతి గృహ సంక్షేమ అధికారి ఆర్‌.కవితి, విద్యార్థులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి):మండలంలోని పవర్‌గూడ, జండాగూడ, లేండిగూడ తదితర గ్రామాల్లో మార్కెట్‌ కమిటి చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌, ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి తదితరులు మొక్కలు నాటారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామీణ ప్రజలకు వివరిస్తు సాధ్యమైనంత వరకు ఎక్కువగా మొక్కలు నాటాలని సూచించారు. ఉపాధి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి పొలం గట్లు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని కోరారు. గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, ఎపీవో నగేష్‌, ఎంపీవో మోహన్‌ తదితరులు పర్యవేక్షించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 2 వేలకు పైగా మొక్కలు నాటాలని అధికారులు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ, కోటేష్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ పంద్ర షేకు తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎస్సై అనీల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక పోటీసు స్టేషన్‌లో ఎంపీడీఓ ఆల్బర్ట్‌, ఎఫ్‌ఆర్వో అనీల్‌కుమార్‌తో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీవో సతీష్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 10:26 PM