Share News

kumaram bheem asifabad- ప్రణాళికలు సిద్ధం చేయాలి

ABN , Publish Date - Aug 23 , 2025 | 10:58 PM

దర్తి అభ జనజాతీయ గ్రామీణ ఉత్సవ్‌ అభియాన్‌ ఆదికర్మ యోగి అభియాన్‌ పథకం కింద ఎంపికైన గిరిజన గ్రామాల్లో కావాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం వచ్చే నెల 7వ తేదీలోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఆదికర్మ మిషన్‌ బ్లాక్‌ స్థాయి మాస్టర్‌ టైనర్ల శిక్షణ ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు.

kumaram bheem asifabad- ప్రణాళికలు సిద్ధం చేయాలి
మాట్లాడుతున్న గిరిజన సంక్షేమశాఖ అధికారి రమాదేవి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): దర్తి అభ జనజాతీయ గ్రామీణ ఉత్సవ్‌ అభియాన్‌ ఆదికర్మ యోగి అభియాన్‌ పథకం కింద ఎంపికైన గిరిజన గ్రామాల్లో కావాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం వచ్చే నెల 7వ తేదీలోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఆదికర్మ మిషన్‌ బ్లాక్‌ స్థాయి మాస్టర్‌ టైనర్ల శిక్షణ ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 25న మండల కేంద్రాలలో శాఖల వారిగా గ్రామ స్థాయి మాస్టర్‌ టైనర్లను గుర్తించాలని అన్నారు. 29, 30 తేదీల్లో గ్రామ స్థాయి శిక్షణ తరగతులు ఎంపిడీవో కార్యాలాయల్లో నిర్వహించాలని సూచించారు. వచ్చే నెల 1 నుంచి 7వ తేదీల్లో పథకానికి ఎంపికైన గిరిజన గ్రామాల్లో గ్రామస్థాయి నోడల్‌ అధికారి, కార్యదర్శి అధ్యక్షతన గ్రామంలో కావాల్సిన పథకాలను గుర్తించి నివేదికలు మండల స్థాయి నోడల్‌ అధికారి ఎంపీడీవోలకు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్‌, ఏటీడీవో శ్రీనివాస్‌, చిరంజీవి, మిషన్‌ భగీరథ ఈఈ సిద్దికి, ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రతినిధి సదానందం, జిల్లా స్థాయి మాస్టర్‌ టైనర్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 10:58 PM