kumaram bheem asifabad- వ్యవసాయ యాంత్రీకరణకు ప్రణాళిక సిద్ధం
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:02 PM
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలులో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొం దించింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో గతంలో ఉన్న మార్గదర్శకాలను ప్రభుత్వం తొలగించింది. దీంతో వ్యవసాయ అధికారులు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణకు సన్నాహాలు ప్రారంభించారు.
- జిల్లాకు 3,598 మూనిట్లు
వాంకిడి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలులో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొం దించింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో గతంలో ఉన్న మార్గదర్శకాలను ప్రభుత్వం తొలగించింది. దీంతో వ్యవసాయ అధికారులు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణకు సన్నాహాలు ప్రారంభించారు. గతంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలు కోసం కుమరం భీం జిల్లాకు రూ. 2.51 కోట్లు నిధులతో 3,598 మూనిట్లు అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను ఈ పథకానికి కేటాయిస్తు న్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా జనరల్ కేటగిరీ రైతు లకు 40 శాతం సబ్సిడీ వర్తించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు ఆలస్యం కావడంతో బడ్జెట్ కేటాయించలేదు. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని వానాకాలం నుంచి యాసంగి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.
- దరఖాస్తుల స్వీకరణ ప్రార ంభం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి వ్యవసాయ అధికారులు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. వ్యవసాయ అధికారులు అన్ని దరఖాస్తులను జిల్లా కలెక్టరుకు అందజేస్తారు. జిల్లా కమిటీ ఆమోదం తరువాత యూనిట్లను మండలాల వారీగా కేటాయిస్తారు. ఎంపికైన రైతులు సబ్సిడీ పోను పెట్టుబడి వాటాను డీడీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న రైతుల కు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా సెప్టెంబరు నుంచి పరికరాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కాగా ఆరేళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆటకెక్కింది. తాజాగా ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులకు నచ్చిన కంపెనీకి చెందిన వ్యవసాయ పరికరాలను అందించనున్నారు.
- ఎనిమిది రకాల పరికరాలు..
జిల్లాలో ఎనిమిది రకాల పరికరాలను అందిచేం దుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆధునిక వ్యవసా యాన్ని ప్రోత్సహించేందుకు కొనసాగిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం గత ఆరేళ్లుగా నిలిచింది. దీంతో రైతులు ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించే అవకాశం లేకుండాపోయింది. ఈ పథకాన్ని అమలు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేసిన గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ ఊసు లేకుం డాపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడాది యాసంగి నుంచే రైతులకు రాయి తీపై వ్యవసాయ పరికరాలను అందచేయాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకునేందుకు ఉమ్మడి జాల్లాల వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు తీసుకుంది. రైతులకు అందజేయాల్సిన పనిముట్లు, యంత్ర పరికరాల జాబితాను రూపొందించారు. కుమరం భీం జిల్లాలో ఎనిమిది రకాల పరిక రాలను అందిచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో రోటవేటర్, కల్టివేటర్లు, పవర్ స్ర్పేయర్లు, పవర్ వీడర్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, బండ్ ఫార్మర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్లు, బ్యాటరి స్పేయర్లు అందించనున్నారు. ఆసక్తి ఉన్న అర్హులైన రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో సంబంధిత ఏఈవోలకు దరఖాస్తు చేయాలి.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..
- మిలింద్ కుమార్, ఆసిఫాబాద్ ఏడీఏ
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులను నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. అర్హులైన రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో సంబంధిత ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ తరువాత జిల్లా, మండల స్థాయి కమిటీల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి పరిక రాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. రైతులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.