kumaram bheem asifabad- ఉపాధికి ‘ప్రణాళిక’
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:27 PM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026-27 సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా గ్రామీఽణా భివృద్ధి సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్కడి ప్రజల సమ్మతంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఈనెలఖరులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిం చారు.
- కొనసాగుతున్న గ్రామసభలు
- స్థానికుల సమ్మతితో పనుల గుర్తింపు
- నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026-27 సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా గ్రామీఽణా భివృద్ధి సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అక్కడి ప్రజల సమ్మతంతో పనులు గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఈనెలఖరులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిం చారు. నవంబరు చివరి నాటికి పనుల లక్ష్యాన్ని ఖరారు చేయనున్నారు. పథకంలో భాగస్వాములైన కూలీలందరికీ ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇందులో భాగంగా ముందుగా గ్రామాలకు అవసరమైన పనులు గుర్తించడంతో పాటు ప్రజల అంగీకారం తప్పనిసరి కావడంతో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో పనులకయ్యే ఖర్చు వివరాలు తయారుచేసి తీర్మానాల ను ఉపాధిహమీ వెబ్‌సైట్‌లో పొందుపరిచి ప్రభుత్వ అనుమతి తీసుకొవాల్సి ఉంది.
- మార్చితో ముగియనున్న నేపథ్యంలో..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో 2026-27లో చేపట్టే పనులను ఇప్పటి నుంచే గుర్తించనున్నారు. జిల్లాలోని 335 గ్రామపంచాయతీల్లోఈ నెలఖరులోగా గ్రామసభ లు పూర్తిచేసి నవంబరులో మండలాల వారీగా తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించనున్నారు. వాటిని క్రోడిక రించి రాష్ట్రస్థాయిలో ఆమోదానికి ప్రతిపాదిస్తారు. కాగా అడిగిన వారికి పని కల్పించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఉపాధిహామీ పథకం నిర్వ హణ ఇకనుంచి గ్రామం యూనిట్ వ్యక్తిగత అభివృద్ది పనులను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉపాధి పనులు జిల్లా యూనిట్‌గా తీసుకొని నిర్వహిస్తుండ గా ఒక గ్రామంలో పనులు ఎక్కువగా మరో గ్రా మంలో తక్కువగా జరుగుతున్నాయి. పథకం ఉద్దేశం ప్రకారం పని అడిగిన 14 రోజుల్లోగా చర్యలు తీసుకో వాలి. ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ వివరాలు నమోదైతే పని కల్పిం చకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.
- పనులు ఇలా..
పథకం ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, వనమహోత్సవం, పల్లె క్రీడా మైదానాలు వంటి పనులు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు, కాల్వల పనులు చేపట్టను న్నారు. ఈసారి భూగర్భ జలాలు పెంచేలా ఇంకుడు గుంతలు, పంట కాల్వలు, మట్టిదారులు, కందకాల తవ్వకాలు, పశువుల పాకల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్య..
- దత్తారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనుల్లో నీటి సంరక్షణ పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయ అనుబంధ మొక్కల పెంపకల, వ్యక్తిగత అభివృద్ది పనులు, పశువుల కొట్టాల నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కోళ్లఫాం ఏర్పాటు, ఫిస్ ఫాండ్ పనులకు ప్రాధాన్యం కల్పిస్తాం. గ్రామసభల అనం తరం నివేదిక రూపొందిస్తాం.