Share News

డీసీసీ అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథ్‌ రెడ్డి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:14 PM

డిస్ర్టిక్ట్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షు డిగా రామకృష్ణాపూర్‌ పట్టణానికి చెందిన సీనియర్‌ నాయకుడు పిన్నింటి రఘునాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. శనివారం సాయంత్రం ఆలిండియా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ విడుదల చేసిన డీసీసీ అధ్య క్షుల జాబితాలో రఘునాథ్‌రెడ్డికి చోటు దక్కింది.

డీసీసీ అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథ్‌ రెడ్డి

మంచిర్యాల,నవంబరు22(ఆంధ్రజ్యోతి): డిస్ర్టిక్ట్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షు డిగా రామకృష్ణాపూర్‌ పట్టణానికి చెందిన సీనియర్‌ నాయకుడు పిన్నింటి రఘునాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. శనివారం సాయంత్రం ఆలిండియా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ విడుదల చేసిన డీసీసీ అధ్య క్షుల జాబితాలో రఘునాథ్‌రెడ్డికి చోటు దక్కింది. రఘునాథ్‌ రెడ్డి ప్రస్తు తం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీసీసీ మెంబరుగా కొనసాగు తున్నారు. ఆయన ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ప్రెసిడెంట్‌గా సైతం సేవలందించా రు. రఘునాథ్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌ యూత్‌ జిల్లా అధ్యక్షులుగా ఏడేళ్లు, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడిగా ఐదేళ్లు, పీసీసీ కార్యదర్శిగా ఏడేళ్లు, నాగర్‌క ర్నూల్‌ పార్లమెంటు కోఆర్డినేటరుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉం ది. మంత్రి, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేకా నందకు సన్నిహితుడిగా పేరు ఉండడంతో డీసీసీ పదవి ఆయనను వరించింది.

29 మంది దరఖాస్తు...

డీసీసీ పదవి కోసం జిల్లాలో విపరీతమైన పోటి నెలకొంది. ప్రస్తుత అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ రెండు దఫాలుగా డీసీసీ పదవిని అలంక రించగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కూడ పదవిని ఆశించారు. ఆయ నతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కారుకూరి రాంచందర్‌, మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేతలు కేవీ ప్రతాప్‌, సిరిపురం రాజేశ్‌, గడ్డం త్రిమూర్తి, డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌గౌడ్‌, వంగల దయా నంద్‌ సైతం పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి పరిధిలో మొత్తం 29 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పురాణంకు ’చెక్‌’’ పెట్టేందుకేనా...?

చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి డీసీసీ పదవికి పోటి పడి భంగపడ్డవా రిలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కుమార్‌ ప్రముఖంగా ఉన్నారు. ఆ యన బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండగా 12ఏళ్ల పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. టీడీపీ హయాంలో తెలుగు యువత జిల్లా అధ్య క్షులుగా, టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, స్టేట్‌ సెక్రటరిగా పని చేశా రు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా సేవలందించారు. అత్యంత అనుభవం గల పురాణంకు డీసీసీ పదవి దక్కితే మంత్రి వివేక్‌కు కొరకరాని కొయ్యగా మారతారనే ప్రచారం సైతం ఉండడంతో ఆయనకు కావాలనే చెక్‌పెట్టిన ట్లు కాంగ్రెస్‌ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:14 PM