Physiotherapists: ఫిజియోథెరపిస్టులు.. డాక్టర్లు కాదు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:13 AM
రాష్ట్రంలో ఫిజియోథెరపిస్టులు తమ పేరు ముందు ’డాక్టర్’ అనే పదాన్ని ఉపయోగించకూడదని ఇండియన్ మెడికల్..
డాక్టర్ పదాన్ని ఉపయోగించకూడదు: ఐఎంఏ తెలంగాణ
నల్లకుంట, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫిజియోథెరపిస్టులు తమ పేరు ముందు ’డాక్టర్’ అనే పదాన్ని ఉపయోగించకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ విభాగం పేర్కొంది. ఈ మేరకు భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆదేశాలు జారీ చేసిందని తెలిపింది. బుధవారం ఐఎంఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు డి.ద్వారకానాథ్‌రెడ్డి, కార్యదర్శులు వి.అశోక్, టి.దయాళ్‌సింగ్ మాట్లాడారు. ఫిజియో థెరపిస్టులు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయ పడగా, వైద్యులు రోగ నిర్ధారణ చేసి, చికిత్స, మందులు అందించడానికి శిక్షణ పొందుతారని అన్నారు. ఫిజియో థెరపిస్టులు వైద్యులుగా అర్హులు కారని తెలిపారు.