Physiotherapists Allowed to Use Doctor: ఫిజియోథెరపిస్టులు డాక్టర్ అని పెట్టుకోవచ్చు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:57 AM
ఫిజియోథెరపిస్టులు తమ పేరు ముందు డాక్టర్ అని రాసుకోవచ్చని... అయితే, పేరు చివరన మాత్రం ఫిజియోథెరపిస్టు అని స్పష్టంగా సూచించాలని...
పీఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హరికృష్ణ
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఫిజియోథెరపిస్టులు తమ పేరు ముందు ‘డాక్టర్’ అని రాసుకోవచ్చని... అయితే, పేరు చివరన మాత్రం ఫిజియోథెరపిస్టు అని స్పష్టంగా సూచించాలని పీఎ్‌ఫఐ (ఫిజియోథెరపిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ బాపట్ల వెంకట హరికృష్ణ తెలిపారు. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) జారీచేసిన లేఖ ఆధారంగా సరైన నిర్దేశం లే కుండా.. ప్రసార మాధ్యమాల్లో ఫిజియోథెరపిస్టుల వృత్తి గురించి అపోహలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఫిజియోథెరపిస్టులు తమ పేరు ముందు డాక్టర్ అని రాసుకోకూడదని ఆదేశాలు జారీచేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీత శర్మ... దీనిపై ఫిజియోథెరపిస్టుల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వులను 24 గంటల్లోనే ఉపసహరించుకున్నారని ఆయన తెలిపారు.