Share News

క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:18 PM

క్రీడల్లో గె లుపోటములు సహజమ ని, క్రీడాకారులు స్నేహ పూర్వకంగా క్రీడల్లో పాల్గొ నాలని, క్రీడలతో శారీరక, మా నసిక ఆరోగ్యం చేకూ రుతుందని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అన్నారు.

క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కలెక్టర్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కల్వకుర్తి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : క్రీడల్లో గె లుపోటములు సహజమ ని, క్రీడాకారులు స్నేహ పూర్వకంగా క్రీడల్లో పాల్గొ నాలని, క్రీడలతో శారీరక, మా నసిక ఆరోగ్యం చేకూ రుతుందని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అన్నారు. ఉ మ్మడి మహబూబ్‌నగర్‌, ఉ మ్మడి నల్గొండ జిల్లాల తెలంగాణ గిరిజన ఆశ్రమ, గిరిజన సంక్షేమ వసతిగృహాలు, గురు కుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 6వ గిరి జన జోనల్‌ స్థాయి క్రీడలను గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కల్వకుర్తి వేదికగా మంగళ వారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్య క్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యో తిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి రోజువారి జీవితంలో క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని, క్రీడ లు కేవలం పోటీల్లో గెలవడం లేదా బహు మతులు అందుకోవడం కోసం కాకుండా జీవితంలో క్రమశిక్షణతో ముందుకు సాగేందుకు ప్రేరణగా ఉండాలని సూచించారు. క్రీడల్లో ఓట మిని ఒక పాఠంగా తీసుకుని మరింత సాధన చేసి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ముం దుకు సాగాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్య క్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, తహసీల్దార్‌ ఇబ్రహీం, పాఠశాల ప్రిన్సి పాల్‌ వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌, పీఈటీలు, క్రీడాకారులు, పేరెంట్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:18 PM