kumaram bheem asifabad- పత్తిలో చీడపీడలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:59 PM
ఈ సారి పత్తి పంట ఆశాజనకంగా ఉంది. కానీ అధిక వర్షాలు కురిసిన ఓట పంటను చీడ, పీడలు ఆశిస్తున్నాయి. ఆరు గాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు ఎప్పటికీ కష్టమే. వర్షాకాలం ప్రారంభంలో ఎంతో ఆశలతో పత్తి పంటకు రైతులు సాగుకు శ్రీకారం చు ట్టారు. ఈ క్రమంలో మొదట్లో పత్తి పంటకు అను కూలంగా వర్షాలు కురియడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాలు భారీగా కురుస్తుండడంతో పత్తి పంట కొన్ని చోట్ల చూడడానికి చక్కగా, ఏపుగా కన్పిస్తున్నా పూత కాయ, లేక పోవడం, మరి కొన్ని చోట్ల పత్తి పంట ఎదగకపోవడంతో రైతన్నల్లో కలవ రం మొదలైంది.
కెరమెరి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఈ సారి పత్తి పంట ఆశాజనకంగా ఉంది. కానీ అధిక వర్షాలు కురిసిన ఓట పంటను చీడ, పీడలు ఆశిస్తున్నాయి. ఆరు గాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు ఎప్పటికీ కష్టమే. వర్షాకాలం ప్రారంభంలో ఎంతో ఆశలతో పత్తి పంటకు రైతులు సాగుకు శ్రీకారం చు ట్టారు. ఈ క్రమంలో మొదట్లో పత్తి పంటకు అను కూలంగా వర్షాలు కురియడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాలు భారీగా కురుస్తుండడంతో పత్తి పంట కొన్ని చోట్ల చూడడానికి చక్కగా, ఏపుగా కన్పిస్తున్నా పూత కాయ, లేక పోవడం, మరి కొన్ని చోట్ల పత్తి పంట ఎదగకపోవడంతో రైతన్నల్లో కలవ రం మొదలైంది. దీనికి తోడు అధిక వర్షాల కారణంగా తేమ శాతం అధికంగా మొక్కకు చేరడంతో తెగుళ్ల బెడద మొదలైంది. పత్తి మొక్కను తెగుళ్లు, పురుగు లు, తెల్ల, పచ్చ దోమ వెంటాడుతుండడంతో పూత, కాయలు రావడం లేదు. దీంతో రైతులు పంటలు కా పాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. నాలుగేళ్లుగా పత్తి సాగు చేసిన రైతులకు కొంత మేర మద్దతు ధర లభించింది. దీంతో ఈ ఏడాది కూడా రైతులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
- దుక్కి దున్నడం నుంచి..
దుక్కి దున్నడం, విత్తనాలు, క్రిమిసంహారకాలు, ఎరువుల కోసం ఒక్కో ఎకరాకు సుమారు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చు చేశారు. మొదట విత్తనాలు వేసవి సమయంలో సరిగా వర్షాలు కురవ లేదు. మొలకెత్తక పోవడంతో కొందరు రైతులు మళ్లీ విత్తనాలు వేశారు. ఆగస్టు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండగా ప్రస్తుతం పంటకు చీడపీడలు సోకుతున్నాయి. క్రిమి సంహారకాలు పిచికారి చేద్దామంటే రోజు వర్షం కురుస్తోంది. ఇప్పుడే పత్తి పూత దశలో ఉంది. కొన్ని చోట కాయ దశలో ఉంది. పచ్చ దోమ, తెల్లదోమ ఆశించి మొక్కల అడుగు భాగం నుంచి పత్రహరితాన్ని పీలుస్తున్నాయి. దీంతో ఆకులు మొదట పచ్చబారి ఆతరువాత ఎరుపు రంగులోకి మారుతున్నాయి. ఆకులు కింది వైపునకు ముడుచుకు పోతున్నాయి. చెట్టు కొనలు ముడుచుకు పోయి పెరుగుదల తగ్గి పూత, కాత రావడం లేదు. ఈ పురుగులు రసం పీల్చడంతో గూడలు బలహీన పడతాయి. పిందె పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా దిగుబడి కూడా తగ్గి పోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నివారణ చర్యలు చేపట్టాలి :
- యుగేందర్, వ్యవసాయాధికారి, కెరమెరి
పత్తిలో రసం పీల్చే పురుగు నివారణకు ఎసిటా మిప్రిడ్ 20 శాతం 30 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి ఎకరాకు పిచికారి చేయాలి. లేడా డైపెంథ్యూరాన్, ఇమామాక్టిన్ 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఎసిఫేట్ 75 శాతం మందును 250 గ్రాములు తీసుకుని 150 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారి చేయాలి. తెగుళ్ల నివారణకు డైఫ్నొకొనజోల్, మాంకోజెబ్ మందులు పిచికారి చేసుకోవాలి.