కవ్వాల్‌టైగర్‌జోన్‌లోకి భారీ వాహనాల అనుమతులు
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:01 PM
కవ్వాల్‌టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్ గుండా భారీ వాహ నాలను అనుమతిస్తూ రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అథారిటి ఐఎఫ్‌ఎస్ ఇలూసింగ్ నీరు ఉ త్తర్వులు జారీ చేసినట్లు డీఎఫ్‌ఎఫ్ ఆశీశ్‌సింగ్ తెలి పారు.
జన్నారం, ఆగస్టు11 (ఆంరఽధజ్యోతి): కవ్వాల్‌టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్ గుండా భారీ వాహ నాలను అనుమతిస్తూ రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అథారిటి ఐఎఫ్‌ఎస్ ఇలూసింగ్ నీరు ఉ త్తర్వులు జారీ చేసినట్లు డీఎఫ్‌ఎఫ్ ఆశీశ్‌సింగ్ తెలి పారు. సోమవారం అటవీ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ కవ్వాల్ టైగర్‌జోన్ లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు భారీ వాహనాలకు అను మతిచ్చినట్లు తెలిపారు. స్థానికుల డిమాండ్ మేరకు ఈ నెల 4న వైల్డ్‌లైఫ్ మండలి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించిందని అప్పుడే మండలిలో తీర్మానించినట్లు తె లిపారు. భారీ వాహనాలకు ఎన్విరాన్‌మెంట్ ఫీజు అట వీశాఖ చెక్‌పోస్టులైన తపాల్‌్‌పూర్, ఇంధన్‌పల్లి, పాండ వాపూర్, కొత్తగూడెం చెక్‌పోస్టులలో 150 చొప్పున తీసు కుంటారని కారులకు, జీబులకు 50 రూపాయలని తెలిపారు. అటవీని సంరక్షించుకునే బాధ్యత అందరిపైన ఉందన్నారు.
ఫ27 రోజులుగా మండల కేంద్రంలో భారీ వాహనా లకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త భూమాచారి, బద్రీనాయక్‌లు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. సోమవారం నా టికి 27 రోజులు కావడంతో అటవీశాఖ అనుమతులను ఇవ్వడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు. గత జీవోను రద్దు చేసి నూతన జీవోను వెలువరుచడం పట్ల స్థానికులంతా హర్షం వ్యక్తం చేశారు.