Minister Dhanasari Seethakka: మేడారంలో శాశ్వతంగా నిలిచేలా రాతి కట్టడాలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:23 AM
వేల సంవత్సరాలు నిలిచేలా మేడారంలో రాతి కట్టడాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు..
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
ములుగు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వేల సంవత్సరాలు నిలిచేలా మేడారంలో రాతి కట్టడాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ సన్నిధి మేడారంలో పర్యటించి పూజారులు, ఆదివాసీలు, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో చేపట్టనున్న శాశ్వత నిర్మాణాలపై చర్చించారు. మేడారంలో అభివృద్ధి పనులను పూజారులు, ఆదివాసీల అభిప్రాయం మేరకే చేపడతామన్నారు. 700 చిత్రాలు, గొట్టు గోత్రాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వనదేవతల చరిత్రలు, ఆదివాసీల మూలాలు శాశ్వతంగా నిలిచేలా రాతి కట్టడాలపై లిఖిస్తామని తెలిపారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు మాట్లాడుతూ మేడారం దేవస్థానం అభివృద్ధిపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.