Share News

Minister Ponguleti Srinivas Reddy: ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:00 AM

ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల పాలనలో తెలంగాణకు స్పష్టమైన...

Minister Ponguleti Srinivas Reddy: ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల పాలనలో తెలంగాణకు స్పష్టమైన కొత్త దిశను చూపించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోరుకుని కాంగ్రె్‌సపై విశ్వాసం ఉంచారో ఆ మార్పును రెండేళ్లలోనే ప్రజల కళ్లముందు నిలబెట్టామని చెప్పారు. పౌరసంబంధాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన పునశ్చరణ తరగతుల కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ అన్ని రంగాల్లో తీవ్రమైన సంక్షోభవంలో ఉందన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు చేరడం లేదని, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన ప్రజా సంబంధాల విభాగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 05:00 AM