kumaram bheem asifabad- కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారు
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:14 PM
మొదటి విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ప్రజలు ఆదరించారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జైనూర్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మొదటి విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ప్రజలు ఆదరించారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మొతటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు మారుమూల గ్రామాలలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి పార్టీ అభ్యర్థులకు ఓటేసేలా కృషి చేయాలని కోరారు. ఆదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏడు మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని, ఇందులో పార్టీ కార్యకర్తల కృషి అమోఘమన్నారు. రానున్న రెండో, మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రేస్ పార్టీ మారుమూల గ్రామాల ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముకీద్, ఉపాధ్యక్షులు పెందుర్ ప్రకాష్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, నాయకులు మేస్రాం అంబాజీ, వసీం, హైమద్, అజ్జులాల, షేక్ అబ్బు, తోడ్సం గంగారాం, పర్చకి క్రిష్ణ, కనక భీంరావ్, అనక రాంజీ, నూతన సర్పంచులు తోడ్సం రాజెందర్, రాథోడ్ రాందాస్, దుర్వ సింధు తదితరులు పాల్గోన్నారు.