Share News

సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:11 AM

: సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరుస్తున్న అభ్యర్తులకు ప్రజలు బుద్ది చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం పాతబెల్లంపల్లి గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు

సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి,డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరుస్తున్న అభ్యర్తులకు ప్రజలు బుద్ది చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం పాతబెల్లంపల్లి గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్‌ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. ఎన్నికల్లోఇచ్చిన హామీలపై ప్రజలే నిలదీయాలని సూచించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.

తాండూర్‌ (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సర్పంచు అభ్యర్థులను ప్రజలందరు గెలిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. గురువారం తాండూర్‌ గ్రామంలో సర్పంచు అభ్యర్థి దుర్గం గంగా రాం బ్యాట్‌ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రచా రం నిర్వహించారు. ఇం టింటికి వెళ్లి ప్రజలను ఓట్లు వేయాలని కోరా రు. ఆయన మాట్లా డు తూ గంగారాం అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న నాయకుడన్నారు. పం చాయతీని అభివృద్ధి చేస్తాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 02:12 AM