Share News

శాంతి భద్రతల్లో ప్రజలు పాలుపంచుకోవాలి

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:39 PM

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పాలుపంచుకోవాలని, పోలీ సులు ప్రజల రక్షణ కోసమేనని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. మంగళవారం అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా సీసీ నుంచి మంచిర్యాల ఐబీ వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు.

శాంతి భద్రతల్లో ప్రజలు పాలుపంచుకోవాలి

ఫప్రజల కోసమే పోలీస్‌ ఫడీ సీపీ భాస్కర్‌

మంచిర్యాల క్రైం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి) : శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పాలుపంచుకోవాలని, పోలీ సులు ప్రజల రక్షణ కోసమేనని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. మంగళవారం అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా సీసీ నుంచి మంచిర్యాల ఐబీ వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేం దుకే పోలీసులు ఉన్నారన్నారు. పోలీసులు రక్షణగా ఉన్నారు కాబట్టే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నా రు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై, మత్తుకు బానిసయ్యే వారిపై నిఘా ఉంచి వారి స మాచారాన్ని పోలీసులకు అందించి శాంతి భద్ర తల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాల న్నారు. దేశానికి ఆర్మీ రక్షణ కల్పిస్తుండగా ప్రజ లకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. ప్రజల రక్షణ కోసం ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చే శారన్నారు. ప్రజల కష్ట నష్టాలను దూరం చేయ డం, ధన, మాన, ప్రాణాలను కాపాడడం మా బా ధ్యత అన్నారు. బాధితుల పట్ల సానుభూతితో ఉండడం వల్లనే కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు, నరేష్‌ కుమార్‌, బన్సి లాల్‌లతో పాటు భవన నిర్మాణ సంఘ నాయకులు, ప్లం బర్‌, ఎలక్ర్టికల్‌ సంఘం నాయకులు, యోగా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 10:39 PM