లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:40 PM
వర్షాకాలంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్వాసితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఖానీపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జన్నారం వాగు తదితర ప్రవాహా ప్రాంతాలైన బుడగ జంగాల కాలనీతో పాటు మండలంలోని రోటిగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నవాగును సందర్శించారు.
ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్
జన్నారం,ఆగస్టు17(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్వాసితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఖానీపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జన్నారం వాగు తదితర ప్రవాహా ప్రాంతాలైన బుడగ జంగాల కాలనీతో పాటు మండలంలోని రోటిగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నవాగును సందర్శించారు. ఈసందర్భంగా వర్షాకాలంలో వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ప్రవాహం పెరుగుతుందని పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీప్రాంతం కావడంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుందని వాగులు దాటే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని వాగు పరివాహక ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మండల అధికారులు ఎల్లప్పుడు అప్రమత్తం చేస్తున్నారని అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు తావులేకుండా చూస్తామని అన్నారు. వాగుపై వంతెన నిర్మాణానికి చేపట్టామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీ, మార్కెట్ కమిటీ ఎఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమర్‌షరీఫ్, తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఇసాక్, అల్లంరవి, నందు నాయక్, మామిడిపెల్లి ఇంధయ్య, అయ్యర్ ఫసీఉల్లా తదితరులు పాల్గొన్నారు.