Share News

ఘనంగా పింఛన్‌దారుల దినోత్సవం

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:32 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు నేషనల్‌ పెన్షనర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.

ఘనంగా పింఛన్‌దారుల దినోత్సవం

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు నేషనల్‌ పెన్షనర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గజెల్లి వెంక టయ్య, బండి రాజన్న, పుదారి నర్సయ్య, రాజమౌళి, జ్ఞాని, లక్ష్మీనారాయణ గౌడ్‌, రాజిరెడ్డి, లక్ష్మణ్‌, రాజేశం, రామస్వామి, పర్వతాలు యాదవ్‌, రాంరెడ్డి, గంగయ్య, శ్రీనివాస్‌, చారి, బాపు, పోశం పాల్గొన్నారు.

నస్పూర్‌ (ఆంధ్రజ్యోతి): నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఏరియా వాకర్స్‌ హె ల్త్‌ క్లబ్‌ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత అటవీ శాఖ ఉద్యోగి తిరుపతిరెడ్డిని శాలువా కప్పి పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వాకర్స్‌ హెల్త్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగే శ్వర్‌, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌రావు, వాకర్స్‌ సభ్యులు చంద్రశేఖర్‌, వెం కటేశం, వియాన్‌, ప్రేమ్‌, రమేష్‌, వాకర్స్‌ పాల్గొన్నారు.

మంచిర్యాల క్రైం: మంచిర్యాల పెన్షనర్‌ భవనంలో జరిగిన కార్యక్ర మంలో సీనియర్‌ పెన్షనర్‌ నారాయణ, వీఎల్‌ నర్సింహులను సన్మానిం చారు. నాయకులు నాగేశ్వర్‌, వైకుంటం, తిరుపతి, రాజమౌళి, యోగేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:32 PM