Share News

పింఛన్‌ తిప్పలు..

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:46 PM

వారంతా వయో వృద్ధులు, భర్తలేని ఒంటరి మహిళలు, అంగ వైకల్యం కలవారు. ప్రభుత్వాలు అందించే నెలవారీ పింఛన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.

పింఛన్‌ తిప్పలు..

మూడు బస్సులు మారాతేనే డబ్బులు తీసుకునేది..!

-బొక్కలగ్టు, పులిమడుగు గ్రామస్థుల అవస్థలు

-రెండు గ్రామాల్లో సుమారు 600 మంది లబ్ధి దారులు

పొరుగు గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లక తప్పని పరిస్థితులు

బాధితుల విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న అధికారులు

-గ్రీవెన్‌సెల్‌లో కలెక్టర్‌కు గ్రామస్థుల ఫిర్యాదు

మంచిర్యాల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వారంతా వయో వృద్ధులు, భర్తలేని ఒంటరి మహిళలు, అంగ వైకల్యం కలవారు. ప్రభుత్వాలు అందించే నెలవారీ పింఛన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఆయా వర్గాల ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం క్రమం తప్పకుండా పింఛన్‌ సొమ్మును విడుదల చేస్తున్నప్ప టికీ....నగదును స్వీకరించేందుకు వారంతా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. తమ గ్రామాలను కాదని, ఎక్కడో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామ పంచా యతీలో పింఛన్‌ సొమ్ము ఇస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో అంతదూరం ప్రయాణం చేయక తప్పడం లేదనే ఆవేదనను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల కోసం అధిక వ్యయ, ప్రయాసలకు ఓర్చుకోవలసి వస్తోందని, ఇతర లబ్దిదారుల వలే తమకు కూడా గ్రామంలోనే నగదు ఇచ్చే ఏర్పాట్లు చేయాలన్న విజ్ఞప్తులను సంబంధిత అధికారులు పెడ చెవిన పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పొరుగు గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిందే...

జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామ పంచాయతీల్లో సుమారు 600 మంది వరకు పింఛన్లు అందుకునే లబ్దిదారులు ఉన్నారు. వీరిలో వికలాంగులు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం క్రమం తప్పకుండా నెలవారీ పింఛన్లు పంపిణీ చేస్తోంది. మండలంలో మొత్తం పది గ్రామ పంచాయతీలు ఉండగా, పై రెండు మినహా మిగతా వాటిలో లబ్దిదారులకు అక్కడికక్కడే అధికారులు పింఛన్లు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. కేవలం బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామాల లబ్దిదారులకు మా త్రం ఆ వెసులుబాటు లేక మండలంలోని దాదాపు ఐ దు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మాపూర్‌లోగల పో స్టాఫీస్‌కు వెళ్లాల్సి వస్తోంది. రవాణా సౌకర్యం సక్ర మంగా లేకపోవడంతో రాకపోకలకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని లబ్దిదారులు వాపోతున్నారు. మండ లంలోని మిగతా ఎనిమిది గ్రామాల మాదిరిగా తమకు కూడా స్వగ్రామంలోనే పింఛన్లు అందజేస్తే అధిక వ్య య, ప్రయాసలు తప్పుతాయని, ఈ విషయమై పలు మార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు బస్సులు మారితేనే....

పింఛన్ల కోసం లబ్దిదారులు నేరుగా పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. బొక్కలగుట్టకు చెందిన లబ్దిదారులు బస్సులో పులిమడుగు గ్రామం వరకు ప్రయాణించి, దిగిన తరువాత నేషనల్‌ హైవే 363 అవతలి వైపునకు అండర్‌ పాస్‌ ద్వారా వెళ్లి కోటేశ్వర్‌ పల్లె స్టేజీ వద్దకు చేరుకోవాలి. అక్కడ మరో బస్సు ఎక్కి తిమ్మాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద దిగాలి. అక్కడి నుంచి గ్రామంలోని పో స్టాఫీస్‌ వరకు కాలినడక వెళ్లాలి. పింఛన్లు అందుకున్న తరువాత తిరుగు ప్రయా ణంలో తిమ్మాపూర్‌ నుంచి బస్సులో నేరుగా బొక్కలగుట్ట వరకు ప్రయా ణించాలి. ఈ క్రమంలో పింఛన్ల లబ్దిదారులంతా రాకపోకలు సా గించ డానికి మూడు బస్సులు మారాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ సమయానికి పోస్టాఫీస్‌ వద్దకు చేరుకోని పక్షంలో మరోసారి వెళ్లాల్సి వస్తోందంటున్నారు. బస్సులో కాకుండా ఆటోల్లో ప్రయాణం చేయాలంటే రానుపోను కనీసం రూ. 100 చార్జీ వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. గతంలో రేషన్‌ సరుకుల పరిస్థితి కూడా ఇలా గే ఉండేదని, తిమ్మాపూర్‌కు వెళ్లి తెచ్చుకొనే వారమని, తమ ఆవేదనను గుర్తించిన అధికారులు రేషన్‌ సరుకులను తమ గ్రామంలోనే అందించే వెసు లుబాటు కల్పించారని పేర్కొంటున్నారు. రేషన్‌ మాదిరిగా పిం ఛన్లు కూడా తమ గ్రామాల్లో ఇవ్వాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం....

పింఛన్ల కోసం బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామాల లబ్దిదారులు పడుతున్న అవస్థలపై సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల విభాగం లో బొక్కలగుట్ట నివాసి బల్లికొండ కిషన్‌ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు రా తపూర్వక ఫిర్యాదును అందజేశారు. బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామ పంచాయతీలకు బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ వచ్చి లబ్ధిదారులకు పింఛన్లు అం దించే ఏర్పాటు చేయాలని కోరారు. తక్షణమే స్పందించిన కలెక్టర్‌ అక్క డే ఉన్న డీఆర్‌డీఏ పీడీని సమస్య పరిష్కరించాలని ఆదేశించడంతో తి మ్మాపూర్‌ పోస్ట్‌మాస్టర్‌ హుటాహుటిన ఆయా గ్రామాలకు వెళ్లి లబ్ది దా రులకు ఫించన్‌ సొమ్మును అందజేయడం గమనార్హం. ఇంతకాలం పిం ఛన్ల కోసం వృద్ధులను ఇబ్బంది పెట్టిన పోస్ట్‌మాస్టర్‌, కలెక్టర్‌కు ఫిర్యా దుతో కదిలినప్పటికీ, ప్రతినెలా గ్రామానికి వచ్చి నగదు అందజేయాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.

ప్రతినెలా ఇవ్వాలి....ఆవిడపు రాజయ్య, బొక్కలగుట్ట

పింఛన్ల కోసం ప్రతినెలా తిమ్మాపూర్‌కు వెళ్లిరావడం ఇబ్బందిగా మారింది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఇవ్వాళ గ్రామంలోనే డబ్బులు ఇచ్చారు. అలాగే ప్రతినెలా మా గ్రామంలోనే పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

నానా ఇబ్బందులు పడుతున్నాం....గుండా భీమక్క

పింఛన్ల కోసం పొరుగు గ్రామానికి వెళ్లడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. బస్సులు సమయానికి దొర క్క రోజంతా కష్టపడాల్సి వస్తోంది. ఇతర ఊర్ల మాది రిగానే మా పింఛన్లను మా గ్రామంలోనే ఇస్తే ఇబ్బం దులు తప్పుతాయి.

Updated Date - Sep 01 , 2025 | 11:46 PM