kumaram bheem asifabad- రైతుకు పెన్షన్
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:31 PM
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మానధన్ యోజన పథకాన్ని అందు బాటులోకి తెచ్చింది. 2019ఆగస్టు 9న ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ అవగాహన లేక రైతుల దరికి చేరలేకపోతోంది. మంచి ఉదేఽ్ధశ్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టినా లక్ష్యం నీరుగారిపోతోంది. రై
- అవగాహన లేక నీరుగారుతున్న పథకం
బెజ్జూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మానధన్ యోజన పథకాన్ని అందు బాటులోకి తెచ్చింది. 2019ఆగస్టు 9న ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ అవగాహన లేక రైతుల దరికి చేరలేకపోతోంది. మంచి ఉదేఽ్ధశ్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టినా లక్ష్యం నీరుగారిపోతోంది. రైతులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలు ఉండవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 60ఏళ్లు దాటిన సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించాలని, ప్రతి నెలా జీవితాంతం రూ.3వేల చొప్పున పెన్షన్ అందించేలా పథకానికి రూపకల్పన చేశారు.
- ఐదు ఎకరాల లోపు..
ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులవుతారు. 18నుంచి 40ఏళ్లు ఉన్న రైతులు అర్హులు. ఈమధ్య కాలంలో ఎప్పుడు రైతు పేరు నమోదు చేసుకున్నా పథకానికి అర్హత పొందుతారు. రైతు రూ.55నుంచి రూ.200వరకు ప్రీమియం రూపంలో నెల వారీగా బ్యాంకు ఖాతా ద్వారా చెల్లిం చాలి. రైతు రూ.55చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.55కలిపి ప్రతి నెల జమ చేస్తారు. 20నుంచి 25ఏళ్ల వయసున్న రైతులు రూ.61చెల్లించాల్సి ఉం టుంది. 30ఏళ్ల వయస్సు వారు రూ.105, 40ఏళ్ల వారికి రూ.200చొప్పున ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.3వేల చొప్పున రైతుకు పెన్షన్‌గా వస్తుంది. భర్త మరణిస్తే బార్యకు రూ.1,500 చొప్పున పెన్షన్ అందిస్తారు. కాగా క్షేత్రస్థాయిలో అధికారులు పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు సూచిస్తు న్నారు. అర్హులైన రైతులు మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, నామిని వివరాలు, రైతు సంతకంతో అప్‌లోడ్ చేస్తారు. కాగా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, నేషనల్ పెన్షన్ స్కీం, ఇన్‌కంటాక్స్ చెల్లింపువారులకు ఈ పథకం వర్తించదు.
అవగాహన కల్పిస్తున్నాం..
- నాగరాజు, వ్యవసాయ అధికారి, బెజ్జూరు
గ్రామాల్లో రైతువేదికల్లో 60ఏళ్లు దాటిన వారికి పెన్షన్ స్కీంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకొని మేలు జరిగే లా చర్యలు తీసుకుంటాం. కిసాన్ మాన్‌ధన్ పథకం ద్వారా రైతులకు వృద్ధాప్యంలో ఆసరా ఉం టుంది. ప్రతీ రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.