Deputy CM Mallu Bhatti Vikramarka: రిటైర్డు జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:59 AM
సమాజ సేవాలక్ష్యంతో దశాబ్దాలుగా మీడియా సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని....
డిప్యూటీ సీఎంకు వయోధిక జర్నలిస్టుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవాలక్ష్యంతో దశాబ్దాలుగా మీడియా సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వయోధిక జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆదివారం కలిసిన వయోధిక జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు పెన్షన్ సౌకర్యం విస్తరణకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌లు, బస్సు పాసులు జారీ చేయాలని, రిటైర్డ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ఆరోగ్య వైద్య భీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. రిటైర్డు జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పనకు ప్రజాప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో వయోధిక జర్నలిస్టుల సంఘం నేతలు కేశవరావు, లక్ష్మణరావు, ఎన్.శ్రీనివాసరెడ్డి, బండారు శ్రీనివాసరావు, సి కేశవులు, ఫాజిల్, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.