Share News

Minister Adluri Lakshman Kumar: గిరిజన సంక్షేమ శాఖలో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు

ABN , Publish Date - Oct 04 , 2025 | 03:36 AM

గిరిజన సంక్షేమశాఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.83.07 కోట్లను ప్రభుత్వం బుధవారం..

Minister Adluri Lakshman Kumar: గిరిజన సంక్షేమ శాఖలో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు

రూ.83.07 కోట్లు విడుదల: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ వెల్లడి

గిరిజన సంక్షేమశాఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.83.07 కోట్లను ప్రభుత్వం బుధవారం విడుదల చేసి చెల్లించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. డైట్‌ బిల్లులు రూ.55.19 కోట్లు, హాస్టల్‌ కార్మికుల వేతనాలు రూ.9.44 కోట్లు, ఆశ్రమ పాఠశాలలు/ హాస్టళ్లలో దినసరి వేతన సిబ్బందికి రూ.8.84 కోట్లు, కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్లు(సీఆర్టీ)లకు రూ.9.60 కోట్లు విడుదల అయ్యాయని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌ బిల్లుల వల్ల ఇబ్బంది పడుతున్న సిబ్బందికి ఇది ఉపశమనమని, విద్యార్థుల భోజన సరఫరా, సిబ్బంది వేతనాలు, విద్యా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఇది దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి భట్టి విక్రమార్కకు అడ్లూరి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 03:36 AM