Share News

kumaram bheem asifabad- పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:12 PM

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు ఉఫాద్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ రాష్ట్ర నాయకులు చరణ్‌దాస్‌, వైద్య శాంతికుమారి, సామ్యూల్‌ మాట్లాడారు.

kumaram bheem asifabad- పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి
ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు ఉఫాద్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ రాష్ట్ర నాయకులు చరణ్‌దాస్‌, వైద్య శాంతికుమారి, సామ్యూల్‌ మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్‌సీని ప్రకటించి అమలు చేయాలని కోరారు. పెండిగ్‌ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీసీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారి వారి స్వంత జిల్లాలకు పంపించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సర్ధుబాటు జీవో 25 ను సవరించాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు హన్మంతరావు, గంగారాం, సమతకుమారి, హరీష్‌, ఉషన్న, హేమంత్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:12 PM