Share News

పెండింగ్‌ కేసులను త్వరితగతిన ఛేదించాలి

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:08 PM

పెండింగ్‌ కేసులను త్వరితగతిన ఛేదించాలని అదనపు ఎస్పీ వెంకటే శ్వర్లు ఆదేశించారు.

పెండింగ్‌ కేసులను త్వరితగతిన ఛేదించాలి
సమీక్షలో మాట్లాడుతున్న ఏఎస్పీ వెంకటేశ్వర్లు

- అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు

కల్వకుర్తి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యో తి) : పెండింగ్‌ కేసులను త్వరితగతిన ఛేదించాలని అదనపు ఎస్పీ వెంకటే శ్వర్లు ఆదేశించారు. సోమవారం కల్వకు ర్తి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డివిజనల్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల క్రైమ్‌ పరిస్థితులపై సమీక్షా స మావేశం ఏఎస్పీ నిర్వహించారు. ఈ సం దర్భంగా సబ్‌ డివిజన్‌ వారీగా క్రైమ్‌ కే సులను పరిశీలిస్తూ ఇటీవల నమోదైన వివి ధ రకాలకేసుల విచారణ పురోగతిపై సమీక్షిం చారు. విచారణలు సమయానికి పూర్తిచేసి న్యా యపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని, ఆ లస్యం లేకుండా ప్రజాభద్రతకు సంబంధించిన అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని అధికారు లకు సూచించారు. సమీక్షా సమావేశంలో కల్వ కుర్తి సబ్‌ డివిజన్‌ డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఐలు బి నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:08 PM