పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:51 PM
ఉపా ధ్యాయుల పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్, పార్ట్‌ఫైనల్, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు, పెన్షన్, గ్రాట్యుటీ కమిషన్ తది తర పెండింగ్‌బిల్లులను ప్రభుత్వం చొరవ చూపి తక్షణమే విడుదల చేయాలని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు పర్వత్‌రెడ్డి కోరారు.
- ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి
కందనూలు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ఉపా ధ్యాయుల పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్, పార్ట్‌ఫైనల్, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు, పెన్షన్, గ్రాట్యుటీ కమిషన్ తది తర పెండింగ్‌బిల్లులను ప్రభుత్వం చొరవ చూపి తక్షణమే విడుదల చేయాలని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు పర్వత్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌టీయూ భవన్‌లో శనివారం ఎస్‌టీయూ జి ల్లా అధ్యక్షుడు ఎస్.మురళి అధ్యక్షతన జిల్లా అ త్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌టీయూ ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.సదా నందంగౌడ్‌లు హాజరై మాట్లాడారు. ఉపాధ్యా యుల పదోన్నతులతో పాటు బదిలీలు కూడా చేపట్టాలన్నారు. 317జీవో బాధి తుల సమస్యలను పరిష్కరిం చాలన్నారు. అక్రమ డిప్యూటే షన్లను రద్దు చేయాలన్నారు. హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యే వి ధంగా ప్రభుత్వం తక్షణమే ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఉద్యోగ, ఉపాధ్యాయులకు సహక రించాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతీ నెల సక్రమంగా విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ మాట్లా డుతూ ముఖ్యమంత్రి పెండింగ్ డీఏలను వి డుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీధర్‌రావు, రాష్ట్ర అద నపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా పూర్వ అధ్యక్షుడు సుదర్శన్, జిల్లా నాయకులు క రుణాకర్‌రెడ్డి, బాలస్వామి, ప్రభాకర్, శేఖర్, నర సింహ, జహంగీర్ బాష, వెంకటస్వామి, జలీల్ అహ్మద్, హనుమంతు, సుదర్శన్ పాల్గొన్నారు.