Share News

ఆశ వర్కర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:44 PM

ఆశ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న లెప్రసీ, ఎండీఏ సర్వే చేసిన బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీ యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఆశ వర్కర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

కలెక్టరేట్‌ ధర్నాలో సీఐటీయూ నాయకులు

నస్పూర్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఆశ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న లెప్రసీ, ఎండీఏ సర్వే చేసిన బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీ యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. నస్పూ ర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట శనివారం ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌కు అందించారు. అంతకు ముందుగా జాతీయ రహదారి వద్ద గల కమాన్‌ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రధాన ద్వారం ఎదుట ధ ర్నా చేశారు. ఈ సందర్భంగా దుంపల రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ చా లా కాలంగా పెండింగ్‌లో ఉన్న లెప్రసీ, ఎండిఏ సర్వేలు చేసిన డబ్బులు చె ల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అశాలను పారితోషికంగా పేరిట వెట్టి చాకిరి చేయిస్తున్నయన్నారు. కనీస వేతనం ఇ వ్వకుండా శ్రమ దోపిడికి గురి చేస్తున్నయన్నారు. ఆశాల సమస్యలను పరి ష్కరించకుంటే రానున్న రోజుల్లో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిం చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అ ధ్యక్షురాలు సమ్మక్క, యూనియన్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ శోభ, నాయకులు విజయలక్ష్మి, నాగుబాయి, పద్మ, సీఐటీయూ నాయకులు ప్రకాష్‌, వెంకట స్వామి, దేవదాస్‌ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 10:44 PM