Share News

Harassment Allegations: లైంగిక వేధింపుల కేసు.. తహసీల్దారుకు రిమాండ్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:28 AM

జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి తహసీల్దార్‌ రవీందర్‌ నాయక్‌కు లైంగిక వేధింపుల కేసులో జిల్లా మొదటి అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శుక్రవారం రిమాండ్‌ విధించింది...

Harassment Allegations: లైంగిక వేధింపుల కేసు.. తహసీల్దారుకు రిమాండ్‌

జగిత్యాల క్రైం, సెస్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి తహసీల్దార్‌ రవీందర్‌ నాయక్‌కు లైంగిక వేధింపుల కేసులో జిల్లా మొదటి అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శుక్రవారం రిమాండ్‌ విధించింది. జిల్లా కేంద్రంలోని అర్బన్‌ హౌజింగ్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. పట్టణంలోని అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను వార్డుకో తహసీల్దార్‌ స్థాయి అధికారితో పాటు పలువురు మున్సిపల్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగిపై తహసీల్దార్‌ రవీందర్‌ నాయక్‌ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తహసీల్దార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి జగిత్యాల మొదటి అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా జడ్జి రిమాండ్‌ విధించారు.

Updated Date - Sep 13 , 2025 | 05:28 AM