Share News

kumaram bheem asifabad- ప్రశాంతంగా మూడో విడత ఎన్నికలు

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:02 AM

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లాలో పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని సాలెగూడ గ్రామపంచాయతీ సర్పంచ్‌ వార్డు సభ్యుల స్థానాలకు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించి స్టేజ్‌ ఆరోలకు పలు సూచనలు చేశారు.

kumaram bheem asifabad- ప్రశాంతంగా మూడో విడత ఎన్నికలు
ఆసిఫాబాద్‌ సాలెగూడ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లాలో పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని సాలెగూడ గ్రామపంచాయతీ సర్పంచ్‌ వార్డు సభ్యుల స్థానాలకు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించి స్టేజ్‌ ఆరోలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రంలో రద్దీ లేకుండా చూడాలని ఓటర్లను వరుస క్రమంలో కేంద్రంలోనికి అనుమతించాలని, మధ్యా హ్నం 1 గంటల లోపు వరుసలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించాలని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

కాగజ్‌నగర్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మండలంలో మూడో విడత ఎన్నికల జరుగుతుండడంతో జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రంలో ఉన్న వసతులుపై సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ లెక్కింపులో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు. మండలంలోని భట్టుపల్లి, బసంతినగర్‌, రాంనగర్‌, లైన్‌గూడ పోలింగ్‌ కేంద్రాలను సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా సందర్శించారు. భట్టుపల్లి, ఈసుగాం, నజ్రూల్‌నగర్‌ కేంద్రాలను ఏఎస్పీ చిత్తరంజన్‌ సందర్శించి బందోబస్తు విషయంలో డీఎస్పీ, సీఐలకు పలు సూచనలు, సలహాలను అందజేశారు.

Updated Date - Dec 18 , 2025 | 12:02 AM