ప్రశాంతంగా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:21 PM
మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం తీగల్ పహాడ్‌లోని పీవీఆర్ ఫంక్ష న్ హాల్‌లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్‌తో పాటు జి ల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నందగోపాల్ ఆధ్వ ర్యంలో ఒక్కొక్క షాపు లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపి క చేశారు.
నస్పూర్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం తీగల్ పహాడ్‌లోని పీవీఆర్ ఫంక్ష న్ హాల్‌లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్‌తో పాటు జి ల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నందగోపాల్ ఆధ్వ ర్యంలో ఒక్కొక్క షాపు లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపి క చేశారు. జిల్లాలో 2025-27 సంవత్పరాలకు గాను 73 మ ద్యం షాపులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్‌లను అందరికి చూపిస్తూ ప్రక్రి యను ప్రారంభించారు. డిసెంబరు ఒకటి నుంచి కొత్త షాపు లు అమలులోకి రానున్నాయి. గౌడ్ కులస్తులకు-6, ఎస్సీ- 10, ఎస్టీ-6, జనరల్ కోట-51, మొత్తం 73 షాపులు కేటాయిం చా రు. జిల్లాలో 73 మద్యం షాపులకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 23 వరకు కొత్త షాపులకు దరఖాస్తులు స్వీకరిం చ గా జిల్లా వ్యాప్తంగా 1712 ధరఖాస్తులు వచ్చాయి. లాటరీ లో షాపులు వచ్చిన వారిలో ఆనందం వెల్లివిరియగా, డ్రాలో షాపులు దక్కకపోవ డంతో చాలా మంది నిరాశతో వెనుతిరిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మద్యం షాపుల కేటాయింపులు లాటరీ పద్ధతిని వీడియో, ఫొటో చిత్రీకరణల మధ్య నిర్వహించామన్నారు. ఎంపిక ప్ర క్రియ ప్రశాంతంగా సాగిందన్నారు. లాటరీలో ఎంపికైన అ భ్యర్థులు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన డిపాజిట్ మొ త్తాన్ని చెల్లించాల న్నారు. లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రు సుం చెల్లించడా నికి వీలుగా వేదిక వద్దనే బ్యాంకు వారిచే కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. మిగతాది డిపాజిట్ మొత్తం ప్రభుత్వం నిర్ణ యించిన దశల వారీగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిసెం బరు ఒకటి నుంచి కొత్త షాపులు అమలులోకి వ స్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా లోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.