ప్రశాంతంగా తొలి విడత ఎన్నికలు...
ABN , Publish Date - Dec 12 , 2025 | 02:13 AM
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ప్రక్రియ కొన సాగింది. తొలి విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంట ల నుంచి ప్రారంభంకాగా రాత్రి వరకు కొనసాగింది.
-81 సర్పంచ్, 514 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ
-ఓటు హక్కు వినియోగించుకున్న 95,810 మంది ఓటర్లు
-80.4 శాతం పోలింగ్ నమోదు
మంచిర్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ప్రక్రియ కొన సాగింది. తొలి విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంట ల నుంచి ప్రారంభంకాగా రాత్రి వరకు కొనసాగింది. అత్య ధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాల వారీగా 50 శాతం మించకుండా రిజర్వే షన్లు కల్పించారు. సర్పంచ్ స్థానాల్లో బీసీలకు 23, ఎస్సీలకు 117, ఎస్టీలకు 29, జనరల్‌కు 137 స్థానాలను కేటాయిం చారు. అలాగే వార్డు సభ్యుల్లో స్థానాల్లో ఎస్సీలకు 803, ఎస్టీ లకు 253, బీసీలకు 334, జనరల్ కేటగరీకి 1290 స్థానాలను రిజర్వ్ చేశారు.
81 సర్పంచ్, 514 వార్డు సభ్యుల స్థానాలు...
తొలి విడుత పంచాయతీ ఎన్నికలు మంచిర్యాల అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో జరిగాయి. నియోజక వర్గంలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జ న్నారం మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా ఆయా మండలాల పరిధిలో మొత్తం 90 సర్పంచ్ స్థానాలు, 816 వార్డు సభ్యుల స్థానాలను అధికారులు గుర్తించారు. వాటిలో హాజీపూర్ మండలంలో 12 గ్రామ పంచాయతీ (జీపీ)లు ఉండగా, లక్షెట్టిపేట మండలంలో 18, దండేపల్లి మండలంలో 31 జీపీలు, జన్నారం మండలంలో 29 జీపీలు ఉన్నాయి. నాలుగు మండలాల్లోని సర్పంచ్ స్థానాలు 90కి గాను మొత్తం 518 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 260 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే వా ర్డు సభ్యుల స్థానాలు 816కు గాను గడువు ముగిసే నాటికి మొత్తంగా 1749 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి దండేపల్లి మండలంలోని 31 జీపీలకు గాను కొండాపూర్, కొత్త మా మిడిపల్లి, పాత మామిడిపల్లి, ముత్యంపేట నాలుగు పం చాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలోని గూడెం, నెల్కి వెంకటాపూర్ పంచాయతీలు ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యాయి. ఆ గ్రామాల్లో ఎస్టీ ప్రజలు ఎవరూ లేకపోవడంతో సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దా ఖలు కాలేదు. అలాగే మండలంలోని వందురు గూడను వి డగొట్టి కొత్త పంచాయతీగా మార్చడాన్ని నిరసిస్తూ ఆ గ్రా మంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. నామినేష న్లు దాఖలు కాకపోవడంతో వందురుగూడలో ఎన్నికలు ని ర్వహించలేదు. జన్నారం మండలంలోని 29 జీపీలకు గాను లింగయ్యపల్లి, లోతొర్రె పంచాయతీల్లో కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆ రెండింటిని ఎన్నికల అ ధికారులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అలా తొలివిడు తలో మొత్తం తొమ్మిది పంచాయతీల్లో ఎన్నికలు జరుగక పోగా, మిగిలిన 81 జీపీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నాలుగు మండలాల్లో సర్పంచ్ స్థానాలు 81 కిగా ను మొత్తం 258 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే తొలి విడుతలో 816 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా, వాటిలో 306 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 514 వా ర్డులకు ఎన్నికలు నిర్వహించారు.
పోలింగ్ నమోదు...
తొలి విడుతలో ఎన్నికలు జరిగిన మంచిర్యాల నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 80.4 శాతం పోలింగ్ నమోదైంది. గత పర్యాయం 85.26 శాతం పోలిం గ్ నమోదు కాగా, ఈ సారి పోలింగ్ శాతం స్పల్పంగా తగ్గింది. నాలుగు మండలాల పరిధిలో మొత్తం 1,19,700 మంది ఓటర్లు ఉండగా 95,810 మంది తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగిం చుకున్న వారిలో పురుషులు 45,257 మంది ఉండగా, స్త్రీలు 50,552 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. ప్రారంభంలో కొంచెం మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం ఊపందుకుంది. ఓట్లు వేసేందుకు గ్రామస్థులు తరలి వచ్చా రు. ఉదయం 9 గంటల వరకు కేవలం 17 శాతం నమోదై న పోలింగ్, 11 గంటల వరకు 51 శాతానికి పెరిగింది. అలాగే సమయం ముగిసే సరికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 80.4 శాతానికి చేరుకుంది.
24 సమస్యాత్మక కేంద్రాలు...
మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరిగిన జన్నా రం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో మొత్తం 816 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా, వాటిలో 24 కేం ద్రాలను సమస్యాత్మకంగా సెంటర్లుగా ఎన్నికల అధికారు డలు గుర్తించారు. 2600 మంది సిబ్బంది, 400 మంది పోలీసులు ఎన్నికల విధులో పాల్గొనగా, ఎలాంటి ఆవాం ఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్‌శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలె క్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. అలాగే మధ్యాహ్నం 2 గంట ల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు.