kumaram bheem asifabad- మూడు విడతల్లో ప్రశాంతంగా ఎన్నికలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:31 PM
జిల్లాలో మూడు విడతలుగా నిర్వహిం చిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతవరణంలో ముగిశాయని జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో గురువారం ఎస్పీ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నుంచి నేటి వరకు మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి ఎస్పీ అభినందించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు విడతలుగా నిర్వహిం చిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతవరణంలో ముగిశాయని జిల్లా ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో గురువారం ఎస్పీ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నుంచి నేటి వరకు మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి ఎస్పీ అభినందించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 800 మంది పోలీసు అధికారులు, 200 మంది సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందితో పటిష్టమైన బందో బస్తు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేశామని చెప్పారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురి కాకుండా నిరంతర నిఘా కొనసాగించామని వివరించారు. జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టడం ద్వారా నేటి వరకు రూ.22 వేల రూపాయల నగదు, సుమారు రూ.1,88,156 విలువ గల 324 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.1,94,190 విలువ గల ఎనిమది క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 90 చీరలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 18 గంజాయి మొక్కలు, 2.6 కిలోల ఎండు గంజాయి వీటి మొత్తం రూ.2,45,000 ఉంటుందని వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వలువ రూ.6,49,346 ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీ షీటర్లు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ముందస్తుగా 959 మందిని బైండోవర్ చేశామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది చలి, పగలు, రాత్రి లెక్క చేయకుండా విధులు నిర్వహించారని అన్నారు. ప్రతి ఒక్కరు ఎంతో కష్ట పడి పని చేశారని ఎస్పీ ప్రశంసించారు. ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగడంలో కీలక పాత్ర పోషించిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు.
రాజీమార్గమే రాజమార్గం
ఆసిఫాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఎస్పీ మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత సందర్భంగా జిల్లాలో వివిధ రకాల రాజీ పడదగు కేసులలో కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19 నుంచి 21 వరకు ఆసిఫాబాద్, సిర్పూర్(టి) కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మీపై కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైన ట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందన్నారు. యాక్సిడెంట్ కేసులు, వ్యక్తులపై దాడి చేసే కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంఽ దించిన కేసులు చిన్న ఇన్న దొంగతనం కేసులు, డ్రంకెన్‌డ్రైవ్ కేసులు, ఇతర రాజీ పడదగు కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు జాతీయ లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.