మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:05 AM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చండూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తోందని, చర్చలకు వస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటించినా పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని అమిత్‌షా డెడ్‌లైన్ పెట్టడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ, ఖనిజాలు, సహజ వనరులను కార్పొరేట్, మల్టీనేషన్ కంపెనీలకు దారాదత్తం చేయడం దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమన్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో అమాయకులైన ఆదివాసీ ప్రజలను చంపుతున్నారని ఆ వేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలు, దారిద్య్రం ఉన్నంతకాలం ఇలాంటి ఉద్యమాలు మరింత పుట్టుకొస్తాయన్నారు. ప్రశ్నిస్తు న్న ఉద్యమకారులపై అర్బన్ నక్సల్స్ అంటూ ముద్ర వేసి అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శత్రుదేశమైన పాకిస్థాన్‌తో చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసిన కేంద్ర ప్రభు త్వం, మావోయిస్టులతో చర్చలు జరపడానికి వచ్చిన ఆటంకం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 9న దేశవ్యాపంగా కార్మికలోకంతో నిరసన, సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూమిలేని నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో భూగర్భ జలాలు కలుషితమై ప్రజ లు అనారోగ్య పాలవుతున్నారన్నారు. మునుగో డు నియోజకవర్గంలో కాలుష్యం వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఆగస్టు నెలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపా రు. సమావేశంలో నాయకులు నలపరాజు రామలింగయ్య, అంజాచారి, గురిజ రామచం ద్రం, తీర్పాటి వెంకటేశ్వర్లు, నలపరాజు సతీ్‌షకుమార్, శ్రీను, బండమీది వెంకన్న, పరమేశ, ఊశయ్య, నవీన్‌కుమార్, పాల్గొన్నారు.